Sehwag on Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ ఎడిషన్ ఐదవ మ్యాచ్ లొ మంగళవారం రోజు పంజాబ్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బోనీ కొట్టింది. ఐపీఎల్ 2025 మెగా వేళానికి ముందు జట్టును ప్రక్షాళన చేసిన పంజాబ్.. అంచనాలకు తగ్గట్టు రానించి తొలి మ్యాచ్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ అందించిన 244 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి గుజరాత్ కేవలం 232 పరుగులు మాత్రమే చేసింది.
Also Read: Mohammad Siraj: సిరాజ్ మామూలోడు కాదు.. మరో కొత్త అమ్మాయితో డేటింగ్..!
దీంతో 11 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. భారీగా పరుగులు సమర్పించుకుంది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 రన్స్ చేసింది. ఇది పంజాబ్ జట్టుకు రెండవ అత్యధిక స్కోరు. ఇక ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని నిలిపినా.. గుజరాత్ బ్యాటర్లు గొప్పగా పోరాడారు. కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఫలితంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని అందుకోగా.. గుజరాత్ కెప్టెన్ గిల్ కి మరోసారి చేదు అనుభవం ఎదురైంది.
శ్రేయస్ అయ్యర్ అటు బ్యాటర్ గా, ఇటు కేప్టన్ గా తనదైన ముద్ర వేయగా.. గిల్ మాత్రం రెండింటిలోనూ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. గిల్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ చేతిలో ఓటమికి కారణం గిల్ కెప్టెన్సీ తప్పిదాలేనని పరోక్షంగా విమర్శించాడు. ముఖ్యంగా బౌలర్ల సేవలను వినియోగించుకోవడంలో కెప్టెన్ గిల్ విఫలమయ్యాడని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
” పవర్ ప్లే లో సిరాజ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. గిల్ అతడిని ఆపి హర్షద్ ని ఎందుకు తీసుకువచ్చాడు..? గిల్ కెప్టెన్సీ అతడి స్థాయికి తగ్గట్లుగా లేదు. అసలు తను మైదానంలో చురుకుగా ఉన్నట్లే కనిపించలేదు. సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు అనుకునే సమయానికి అర్షద్ ని తీసుకువచ్చాడు. అతడు పవర్ ప్లే లోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చాడు అనుకుంటా. అదే పంజాబ్ కి మొమెంటమ్ ని ఇచ్చింది.
Also Read: Most Ducks In IPL: డకౌట్ లో కూడా మ్యాక్సీ మామ రికార్డ్…టాప్ లో ఉన్న 5 గురు ప్లేయర్లు వీళ్లే !
ఒకవేళ కొత్త బంతితో సిరాజ్ రానిస్తే.. అతడిని డెత్ ఓవర్ల వరకు వేచి ఉంచాల్సిన అవసరం లేదు. నిజానికి చివరి ఓవర్లలోను సిరాజ్ బౌలింగ్ లో పంజాబ్ బ్యాటర్లు బాగానే పరుగులు రాబట్టారు. కెప్టెన్ గా పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేయాలి. కానీ గిల్ నాకేమీ పట్టదన్నట్లుగా ఉండిపోయాడు. కెప్టెన్ గా గిల్ క్రియాశీలకంగా, వేగంగా నిర్ణయాలు తీసుకున్నట్లు అనిపించలేదు. ఇకనుండి అయినా తన ప్రణాళికలు, వ్యూహాల అమలులో పరిస్థితికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే గుజరాత్ కి కష్టాలు తప్పవు” అని చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్.