Nagarjuna: కింగ్ నాగార్జున కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు.నా సామిరంగ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు నాగ్. కానీ ఇతర సినిమాల్లో మాత్రం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున (Nagarjuna) రెండు సినిమాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ నాగార్జున కొత్త సినిమా ప్రకటన మాత్రం రావడం లేదు.
Also Read: ‘రాబిన్‌హుడ్’ రికార్డ్ బిజినెస్.. నితిన్ ముందు భారీ టార్గెట్!
కుబేర.. నాగ్ పోర్షన్ కంప్లీట్!
తెలుగులో ఆనంద్,గోదావరి,లవ్ స్టోరీ వంటి క్లాసిక్ హిట్స్ తీసిన సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar kammula).. ప్రస్తుతం ధనుష్‌తో (Dhanush) ‘కుబేర'(kubera) అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. నాగార్జున ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ధనుష్ ఒక బిచ్చగాడుగా నటిస్తున్నాడు. బిచ్చగాడు సంపన్నుడిగా ఎలా ఎదిగాడనే కథాంశంతో ముంబైలోని ధారావి స్లమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నాగార్జున పాత్ర ఒక ధనవంతుడిగా లేదా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారిగా నటిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అతని ఫస్ట్ లుక్‌లో డబ్బు కట్టల మధ్య నిలబడి ఉన్న సన్నివేశం అభిమానులను ఆకర్షించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాగార్జున పోర్షన్ కంప్లీట్ అయినట్టుగా తెలిసింది. ఈ చిత్రం మొత్తం షూటింగ్ ఏప్రిల్ నెలలో పూర్తి కానుందట. జూన్ 20, 2025న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ఆటకు ‘పెద్ది’ సిద్ధం.. కానీ రెహమాన్ దెబ్బ?
కూలీ విలన్‌గా కింగ్?
ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ కూలీ (Coolie)లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు నాగ్. సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న కూలీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్టర్, విక్రమ్, లియో వంటి హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగం కానప్పటికీ, ఈ చిత్రం ఒక హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో నాగార్జున పాత్ర గురించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు, కానీ అతని లుక్ స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. విలన్‌గా నటిస్తున్నట్టుగా కోలీవుడ్ టాక్. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఇదే సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: రేపే రిలీజ్.. ఇంకా బేరం తెగలేదు
కొత్త సినిమా సస్పెన్స్?
నాగర్జున నటిస్తున్న రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేశారు కానీ, కొత్త సినిమా ప్రకటన మాత్రం ఇవ్వడం లేదు. అసలు ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడనేది? సస్పెన్స్‌గా మారింది. ఇటీవల పూరి జగన్నాథ్‌తో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ పూరి.. విజయ్ సేతుపతితో సినిమా సెట్ చేసుకున్నాడు. దీంతో.. నాగ్ కొత్త సినిమా మళ్లీ సస్పెన్స్‌లో పడిపోయింది. ప్రస్తుతానికి కింగ్ కథలు గట్టిగా వింటున్నట్టుగా సమాచారం. త్వరలోనే నాగ్ నుంచి సాలిడ్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.