BigTV English
Advertisement

2 Planes Collided : గాల్లో ఢీ కొట్టుకున్న ఫైటర్ జెట్లు – ఒళ్లు గగుర్పొడిచే ఘటన

2 Planes Collided : గాల్లో ఢీ కొట్టుకున్న ఫైటర్ జెట్లు – ఒళ్లు గగుర్పొడిచే ఘటన

2 Planes Collided : ఆకాశంలో అద్భుతంగా విన్యాసాలు చేస్తున్న ఫైటర్ జెట్లు.. రంగు, రంగుల పొగలు విడుదల చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. యుద్ధ భూముల్లో గర్జించే జెట్లు.. ప్రశాంతంగా తీరొక్క విధంగా చక్కర్లు కొడుతుండగా.. అనుకోని ప్రమాదం ముంచుకొచ్చింది. అప్పటి వరకు చూడముచ్చటగా సాగిన షో కాస్తా.. అప్పటికప్పుడే గంభీరంగా మారిపోయింది. దీంతో.. అధికారులతో పాటు ఆ ఫీట్లు చూసేందుకు వచ్చిన వీక్షకులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.


ఈశాన్య ఫ్రాన్స్‌లోని సెయింట్-డిజియర్‌లోని ఒక వైమానిక స్థావరం సమీపంలో స్టంట్ రిహార్సల్స్ జరుగుతుండగా.. రెండు మిలిటరీ జెట్‌లు గాల్లోనే ఢీకొన్నాయి. ఆకాశంలోనే నిప్పుల వర్షంలా మారి భూమిపై కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పైలట్లు గాయపడగా, విన్యాసాలు చూసేందుకు వచ్చిన ఓ ప్రయాణీకుడు గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ప్రమాదం తర్వాత ఫైలెట్లు విమానం నుంచి పారాచూట్ ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారని ఫ్రెంచ్ వైమానిక దళం సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఫ్రాన్స్ కు చెందిన వైమానిక విన్యాస ప్రదర్శన విభాగమైన ప్యాట్రౌయిల్ డీ ఫ్రాన్స్ (PAF).. ఏడు విమానాల బృందంతో విభిన్న విన్యాసాలు నిర్వహిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:40 గంటల ప్రాంతంలో ఈ విన్యాసాలు సాగుతుండగా, ఏడు విమానాలు రంగుల పొగను విడుదల చేస్తూ ఆకాశంలో ఆశ్చర్యపరిచేలా ఒకేతీరుగా విన్యాసాలు చేస్తున్నారు. అంతలోనే అందులోనే రెండు జెట్‌లు ఒకదానికొకటి ఢీకొన్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్టు అయ్యింది.


అప్పటి వరకు ఫైటర్ జెట్ల విన్యాసాలు చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిన వాళ్లు కాస్తా.. రెండు జెట్లు వేగంగా భూమి పైకి వస్తుంటే హడలెత్తిపోయారు. చూస్తుండగానే.. రెండు జెట్లలోని ఫైలట్లు తమ పారాచూట్లను యాక్టివేట్ చేసి, ప్రమాదానికి గురైన జెట్ల నుంచి భయటకు వచ్చేశారు. జెట్‌లు నేలపై కూలిపోయి భగ్గున మండుతూ కాలిపోయాయి. కాగా.. ఈ ఫైటర్ జెట్ల క్రాష్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫ్రాన్స్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెకోర్ను వెల్లడించారు.

ప్రమాదం తర్వాత అత్యవసర సేవల దళాలు వెంటనే స్పందిచాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైలట్లు స్వల్పంగా గాయపడ్డారు, వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదం తర్వాత ఒక జెట్ విమానం సిలోను, మరొకటి దాని వెనుక ఉన్న చిత్తడి అటవీ ప్రాంతంలో కూలిపోయిందని రక్షణ శాఖ ప్రకటించింది. అయితే.. ఈ విమాన ప్రమాదానికి కారణమేమిటో స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలుపుతున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు.

Also Read : Missile City : భూగర్భంలో భారీ క్షిపణి నగరం – తొలిసారి ప్రపంచానికి లీక్

ప్రమాదానికి గురైన విమానాల్ని ఆల్ఫా జెట్ లుగా తెలిపారు. ఈ యుద్ధ విమానాల్ని 1970లలో ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, జర్మనీకి చెందిన డోర్నియర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇవి తేలికపాటి దాడి చేసే సామర్థ్యం ఉంది. అలాగే.. దీనిని అధునాతన శిక్షణ విమానంగానూ వినియోగిస్తున్నారు. ఈ జెట్‌లలో రెండు సీట్లు ఉంటాయని, దీనిని సాధారణంగా పైలట్ శిక్షణ, ఏరోబాటిక్ విన్యాసాలకు ఉపయోగిస్తారని అధికారులు తెలుపుతున్నారు.

Tags

Related News

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

Big Stories

×