E-Paper
Advertisement

ఇండియా వ‌ల్లే, అంత‌ర్జాతీయ క్రికెట్ మ‌నుగ‌డ సాగుతోంది

ఇండియా వ‌ల్లే, అంత‌ర్జాతీయ క్రికెట్ మ‌నుగ‌డ సాగుతోంది
Advertisement

Kevin Pietersen On Team India:  టీమిండియా (Team India) ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టు. ప్రపంచ క్రికెట్ వ్యవస్థను కూడా మన టీమిండియా, బీసీసీఐ ( BCCI) శాసించగలదు. ముఖ్యంగా బీసీసీఐ దగ్గర ఉన్నన్ని డబ్బులు ఏ క్రికెట్ బోర్డు దగ్గర లేవు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను ( Indian Premier League tournament) సమర్థవంతంగా నడిపిస్తోంది బీసీసీఐ. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council) కూడా బీసీసీఐ మాట జవదాటదు. అంత పవర్సు బీసీసీఐ దగ్గర ఉన్నాయి. కోట్లలో డబ్బులు… దానికి తగ్గట్టుగానే టీమిండియా ప్రదర్శన కూడా ఉంటున్న సంగతి తెలిసిందే.

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

బీసీసీఐ లేక‌పోతే అంద‌రూ అడుక్కుతినాల్సిందే

Advertisement

ఈ క్రమంలో టీమిండియా క్రికెట్ జట్టు, భారత క్రికెట్ నియంత్రణ మండలి పై ( BCCI) మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తం ఇండియా పైన ఆధారపడి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండియా లేకపోతే ప్రపంచ క్రికెట్ మనుగడ కూడా కొనసాగబోదని స్పష్టం చేశారు. అసలు ఇండియా లేకపోతే క్రికెట్ వ్యవస్థ అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు కెవిన్ పీటర్సన్. వాళ్ల ద్వారా చాలా క్రికెట్ బోర్డులు మ‌నుగ‌డ కొనసాగిస్తున్నాయని కూడా పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి… ఐసీసీని కూడా శాసిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

ఐపీఎల్ పై కూడా ప్రశంసల వర్షం

భారతదేశం నుంచి వచ్చే భారీ పెట్టుబడులు, యువర్ షిప్, స్పాన్సర్ షిప్ లు లేకపోతే అంతర్జాతీయ క్రికెట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేదని వివరించారు మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen). ఇండియా లేని క్రికెట్ ఊహించలేమని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ బలంగా ఉండడానికి భారత్ ఒక్కటే కారణమని వివరించారు. ఈ దేశంలో క్రికెట్ తప్ప.. ఏ గేమ్స్ పెద్దగా పట్టించుకోరని తెలిపారు. అందుకే ఇక్కడ క్రికెట్ జరిగిన ఇండియాలో చూసే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు మద్దతుగా కూడా కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ వల్ల కౌంటీ క్రికెట్, టెస్ట్ క్రికెట్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఐపీఎల్ కారణంగా చాలా మంది యంగ్ స్టార్స్ అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తున్నారని గుర్తు చేశారు. రంజి ట్రోఫీ లో కంటే ఐపీఎల్ ఆడడం బెస్ట్ అన్నారు కెవిన్ పీటర్సన్. దీంతో మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

Related News

బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు ర‌ద్దు చేయండి..బీసీసీఐకి హ‌ర్భ‌జ‌న్ సింగ్ వార్నింగ్ !

నాకు ఆ భూమి కావాల్సిందే..అర్ధరాత్రి ముఖ్యమంత్రిని బెదిరించిన రిషబ్ పంత్ !

ఉస్మాన్ తారిక్ కు కావ్య పాప బిగ్ షాక్‌.. బ్యాన్ వేయాల్సిందేన‌ని ఫిర్యాదు!

నాకు బౌలింగ్ చేసేందుకు హేజిల్‌వుడ్ భ‌య‌ప‌డ్డాడు..ప‌రువు తీసిన పుజారా

కోహ్లీ చేసిన ఆ చెత్త ప‌నికి బండ‌బూతులు తిట్టా…శిఖ‌ర్ ధావ‌న్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

టీమిండియా క్రికెట‌ర్ల జ‌ల్సాల‌కు BCCI చెక్‌…తెర‌పైకి కొత్త ఫిట్ నెస్ టెస్టులు!

రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ఆడ‌తాను…షాదాబ్ ఖాన్ సంచ‌ల‌నం ?

Big Stories

Advertisement
×