Harbhajan Singh On Ind vs Ban: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సానుకూల వాతావరణం క్రమ క్రమంగా పెరుగుతోంది. బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో, ఇండియాతో సంబంధాలు పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పటి లాగే టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ (Team India vs. Bangladesh) మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేలా అడుగులు పడుతున్నాయి. సెప్టెంబర్ మాసంలో ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేలతో పాటు మూడు టీ20 లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board
), బీసీసీఐ ( BCCI) మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో సమావేశం తర్వాత ఈ సిరీస్ పై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా (Team India vs. Bangladesh) మధ్య మూడు వన్డేలు, మూడు టి20 లు త్వరలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సీరియస్ అయ్యారు. మన హిందువులను హింసించిన బంగ్లాదేశ్ తో మళ్ళీ క్రికెట్ ఆడతారా ? కొంచమైనా సిగ్గుందా ? అంటూ ఫైర్ అయ్యారు. హిందువులను అణచివేసిన బంగ్లాదేశ్ తో ఎప్పటి లాగా బంధాలు పెంచుకుంటారా ? అని ఈ నిలదీశారు. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారినప్పటికీ, ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్ పర్యటనలు బీసీసీఐ ( BCCI) రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇండియాను ద్వేషిస్తున్న బంగ్లాదేశ్ లో టీమిండియా క్రికెటర్లు పర్యటిస్తే, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో టీమిండియా క్రికెటర్లు అడుగు పెట్టిన తర్వాత ఏ ప్రమాదమైనా జరుగువచ్చని వార్నింగ్ ఇచ్చారు. టీమిండియా క్రికెటర్ల ప్రాణాలతో చెలగాటాలు వద్దని వారించారు హర్భజన్ సింగ్. పాకిస్తాన్ లాగానే బంగ్లాదేశ్ ను దూరం పెట్టాలని బీసీసీఐని కోరారు.
బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా ( Bangladesh vs. Team India ) మధ్య సెప్టెంబర్ మాసంలో వైట్ బాల్ క్రికెట్ సిరీస్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టి20 లు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఆగస్టు 28వ తేదీన బంగ్లాదేశ్ కు టీమిండియా ప్రయాణించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 13వ తేదీ వరకు 3 టి20లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన వన్డేలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు