Amit Mishra On Abhishek Sharma: టీమిండియా జట్టులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డేంజర్ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) గురించి మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit Mishra) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ సిక్సుల వీరుడు, భయంకరమైన బ్యాటర్ అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు… కానీ వాడికి అంత సీన్ లేదంటూ పరువు తీశారు. అభిషేక్ శర్మ ఓ గాలిగాడు అంటూ హేళన చేశారు. గుడ్డిగా బ్యాట్ ఊపడం తప్ప… సరిగ్గా ఆడడం అభిషేక్ శర్మకు చేతకాదని సెటైర్లు పేల్చారు. ఇలాంటి వాడు టీమిండియా కు అస్సలు పనికిరాడు అని అమిత్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేస్తున్నాడని… ఇందులో బంతి తగిలితే సిక్సర్, లేదా వికెట్ పోవడం గ్యారెంటీ అని హెచ్చరించారు. ఇలాంటి వాళ్లను బీసీసీఐ ఎంకరేజ్ చేయొద్దన్నారు.
టీమిండియా డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి అమిత్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ కూడా ఓ స్లాగర్ అంటూ చురకలు అంటించారు. బ్యాటింగ్ సరిగ్గా చేయడం చేతకాదని పరువు తీశారు. ఇప్పటికైనా టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని లాగా ఆడడం నేర్చుకోవాలని కోరారు. మహేంద్ర సింగ్ ధోని కూడా తన కెరీర్ ప్రారంభంలో భారీ సిక్సర్లు, బౌండరీలు కొట్టి… జనాలను ఎంటర్టైన్ చేశాడని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితికి తగ్గట్టుగా… స్లోగా బ్యాటింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడని వివరించారు.
అందుకే గొప్ప ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని ఎదగడమే కాకుండా… మిస్టర్ కూల్ కెప్టెన్ అయ్యాడని ప్రశంసించారు. అలాంటి కెరీర్ అభిషేక్ శర్మ సాధించాలని కోరారు. మహేంద్ర సింగ్ ధోని ఎలా కెరీర్ ను ముందుకు తీసుకువెళ్లాడు..? ఎలా ముగించాడు? అనే దాని పైన అభిషేక్ శర్మ అన్వేషణ చేయాలని కోరారు. ధోని లాగా పరిస్థితిని తగ్గట్టు ఆడితేనే అభిషేక్ శర్మ పెద్ద స్టార్ అవుతాడని వెల్లడించారు. లేకపోతే ఒక మ్యాచ్ లో ఆడడం.. నాలుగు మ్యాచ్లలో డక్ అవుట్ కావడం లాంటి సంఘటనలే జరుగుతాయని అభిషేక్ శర్మ ఇజ్జత్ మొత్తం తీశాడు.
అభిషేక్ శర్మకు మంచి టాలెంట్ ఉంది అని అమిత్ మిశ్రా వెల్లడించారు. కానీ దాన్ని వినియోగించుకోవడంలో అభిషేక్ శర్మ విఫలమవుతున్నాడని తెలిపారు. మ్యాచ్ పరిస్థితిని ఆడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ కాలం ఉండాలంటే ధోని అడుగుజాడల్లో అభిషేక్ శర్మ నడవాలని కీలక సూచనలు చేశారు అమిత్ మిశ్రా. దీంతో అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు