E-Paper
Advertisement

పేరుకే కోహ్లీ, రోహిత్ సీనియ‌ర్లు…ఈ ఇద్ద‌రితో 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం క‌ష్ట‌మే

పేరుకే కోహ్లీ, రోహిత్ సీనియ‌ర్లు…ఈ ఇద్ద‌రితో 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం క‌ష్ట‌మే
Advertisement

Daryl Cullinan On Rohit – Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup) నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli), రోహిత్ శర్మ ( Rohit Sharma) ఇద్దరూ టీమిండియాలో ఉండాల్సిందేనని అందరూ పేర్కొంటున్నారు. మాజీ క్రికెటర్ల నుంచి మొదలుకొని సామాన్య క్రికెట్ అభిమాని వరకు… రోకో ( Rohit – Kohli) కాంబినేషన్ ఉంటేనే 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామని ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ ను కించపరుస్తూ… రోకో కాంబినేషన్ ఉండాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు.

పేరుకే కోహ్లీ, రోహిత్ సీనియ‌ర్లు…ఇద్ద‌రితో 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం క‌ష్ట‌మే

అయితే ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను మెచ్చుకుంటూ విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరినీ కించపరిచేలా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ( Daryll Cullinan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేరుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు అని పేర్కొన్న ఆయన… ఈ ఇద్దరితో 2027 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవడం కష్టమేనని బాంబు పేల్చారు. రోకో కాంబినేషన్ పైన గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరును కూడా సమర్పించారు. రోకో కాంబినేషన్ లేకున్నా అవలీలగా టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు డారిల్ కల్లినన్. దీంతో డారిల్ కల్లినన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

కోహ్లీ, రోహిత్ విష‌యంలో గంభీర్ నిర్ణ‌యాలు క‌రెక్ట్

2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ( Daryll Cullinan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే సుదీర్ఘమైన ప్రదర్శన అవసరమన్నారు. మ్యాచ్ కంటే ముందు నెట్ లో ప్రాక్టీస్ చేసి బరిలోకి దిగితే అస్సలు కుదరదు అన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా ఇలాగే చాలా రోజుల నుంచి చేస్తున్నట్లు ఫైర్ అయ్యారు. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే.. ఇప్పటినుంచి ప్రతి క్రికెటర్ సాధన చేయాల్సి ఉంటుందని వివరించారు.

Advertisement

అందుకే గౌతమ్ గంభీర్ ఈ పరిస్థితిని అర్థం చేసుకొని… రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానంలో మరో ఇద్దరి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడని షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. సీనియర్ క్రికెటర్లు అంతర్జాతీయ సిరీస్ ల నుంచి తరచూ రెస్ట్ తీసుకోవడం కంటే… నిలకడగా మ్యాచ్ లు ఆడడం ముఖ్యమని గంభీర్ భావిస్తున్నట్లు వివరించారు. వరల్డ్ కప్ గెలవాలంటే రోకో కాంబినేషన్ ఒక్కటే కాకుండా నిరంతరం మ్యాచ్ లు ఆడే క్రికెటర్లు ఉండాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంటే ఓవరాల్ గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు వన్డే వరల్డ్ కప్ నకు పనికిరారని పరోక్షంగా హింట్ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ ప్లాన్ ప్రకారం నిరంతరం మ్యాచ్లు ఆడే ప్లేయర్లను తీసుకోవాలని బీసీసీఐకి సూచనలు చేశారు డారిల్ కల్లినన్.

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

Related News

మెస్సి పై హ‌త్య‌కు కుట్ర‌లు..అంత‌లోనే తండ్రి జార్జ్ మృతి

అభిషేక్ శర్మ గాలిగాడు.. గుడ్డిగా బ్యాట్ ఊపుతాడు, ఇలాంటోడు టీమిండియా ప‌నికిరాడు

బుమ్రా కంటే మిచెల్ స్టార్క్ మెరుగైన ఫాస్ట్ బౌలర్..టీమిండియాకు ఆడ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడు

ఇండియా వ‌ల్లే, అంత‌ర్జాతీయ క్రికెట్ మ‌నుగ‌డ సాగుతోంది

బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు ర‌ద్దు చేయండి..బీసీసీఐకి హ‌ర్భ‌జ‌న్ సింగ్ వార్నింగ్ !

నాకు ఆ భూమి కావాల్సిందే..అర్ధరాత్రి ముఖ్యమంత్రిని బెదిరించిన రిషబ్ పంత్ !

ఉస్మాన్ తారిక్ కు కావ్య పాప బిగ్ షాక్‌.. బ్యాన్ వేయాల్సిందేన‌ని ఫిర్యాదు!

Big Stories

Advertisement
×