E-Paper
Advertisement

Shahid Afridi : గొప్ప మామగారు.. సొంత అల్లుడికి కెప్టెన్సీ కరెక్ట్ కాదన్న షాహిద్ ఆఫ్రిదీ..

Shahid Afridi : గొప్ప మామగారు.. సొంత అల్లుడికి కెప్టెన్సీ కరెక్ట్ కాదన్న షాహిద్ ఆఫ్రిదీ..
Advertisement

Shahid Afridi : పాకిస్తాన్ క్రికెటర్లలో షాహిద్ ఆఫ్రిదీ అంటే క్రీడాభిమానులు అందరికీ ఆదర్శమే. తన ఆట తీరుతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. క్రీజులోకి వచ్చాక ఎక్కువ సేపు అక్కడ ఉండలేడు. అవతల బౌలర్ ఎవరనేది అస్సలు పట్టించుకోడు.

ఏ బౌలర్ అయినా సరే, ముందుకొచ్చి పడీపడీమని సిక్సర్లు కొట్టడమే తెలుసు. అలా ఎన్నిసార్లు అవుట్ అయినా, తన సహజమైన ఆటతీరుని ఆఫ్రిదీ ఎప్పుడూ మార్చుకోలేదు. జట్టులో చోటు ప్రశ్నార్థకమైనా సరే, చివరి వరకు అలాగే ఆడి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఆడే… టీ 20 ఆటను తనెప్పుడో అందరికీ రుచి చూపించాడు.

Advertisement

అయితే లెగ్ స్పిన్నర్ కావడమే ఆఫ్రిదీకి కలిసివచ్చింది. అందుకే బౌలింగ్ కోటాలో తప్పనిసరిగా బౌలర్ గా జట్టులోకి తీసుకునేవారు. అంతేకాదు జట్టులో ఆల్ రౌండర్ ఆవశ్యకత ఉండేది. అది కూడా తనకి వరం అయ్యింది. పాకిస్తాన్ బోర్డుకి తనని తప్పించడం సాధ్యమయ్యేది కాదు. క్లిక్ అయితే సెంచరీ లేదంటే ఆఫ్ సెంచరీ తక్కువ బాల్స్ లో స్కోర్ ని పెంచి, చకచకా స్టాండ్ లోకి వెళ్లిపోయేవాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే… అలాంటి షాహిద్ ఆఫ్రిదీ తన కుమార్తెకు పెళ్లి చేశాడు. అది మరెవరో కాదు పాకిస్తాన్ యువ ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదీకి ఇచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఘోర వైఫల్యం తర్వాత కెప్టెన్ బాబర్ ఆజామ్ కి కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలికారు. అనూహ్యంగా టీ 20 కెప్టెన్సీని ఆఫ్రిదీ అల్లుడు షాహిన్ కి ఇచ్చారు.

Advertisement

అయితే షాహిద్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్, సర్ఫరాజ్, షాహిన్ అఫ్రిదీ, మహమ్మద్ రిజ్వాన్‌లు అంతా కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాహిద్ ఆఫ్రిది వేదికపై మాట్లాడుతూ టీ20 కెప్టెన్సీని రిజ్వాన్ కి ఇవ్వకుండా షాహిన్ కి ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇదేంట్రా బాబూ, పదిమందిలో సొంత అల్లుడిని పట్టుకుని ఇలా అనేశాడని అంతా అనుకున్నారు. వేదికపై అందరూ నవ్వుకున్నారు.

రిజ్వాన్ ఎంతో కష్టపడి, ఈ స్థాయికి వచ్చాడని, తనంటే నాకెంతో ఇష్టమని, తన ఆటని కూడా ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. దీంతో షాహిద్ ఆఫ్రిది చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. గొప్ప మామగారు రా బాబూ…అని అంతా అనుకున్నారు.

Related News

అభిషేక్ శ‌ర్మ‌ను ‘స్లాగ‌ర్’ అన్న మ‌హ్మ‌ద్ అమీర్ రెండు చెంపలు వాయిస్తాం!

హెచ్ కోచ్ ప‌ద‌వి వ‌దిలేస్తే కోట్లు కుమ్మ‌రిస్తాం..గంభీర్ కు 4 ఐపీఎల్ జ‌ట్ల ఓన‌ర్ల ఆఫ‌ర్లు!

ప‌సికూన‌ల‌పై గెల‌వ‌డం కాదు, ద‌మ్ముంటే పాకిస్తాన్ ను ఓడించండి!

SRHలోకి హార్దిక్ పాండ్యా..ఆ రూ. 20 కోట్ల ప్లేయర్‌ను గెంటేసిన కావ్య పాప ?

నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!

నువ్వు స్లాగ‌ర్ కాదు, రియ‌ల్ హీరో…అభిషేక్ శ‌ర్మ‌కు పాక్ బౌల‌ర్ క్ష‌మాప‌ణ‌లు

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

Big Stories

Advertisement
×