Shahid Afridi : ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సరిహద్దుల్లో నిత్యం కాల్పులు, ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు భారత్ సైనికులు, పౌరులు మరణిస్తే.. మరో రోజు పాక్ సైనికులు మరణిస్తున్నారు. సరిహద్దుల్లో కాల్పులు జరపడంతో చాలా మంది సరిహద్దు ప్రాంతాల వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. మరికొందరూ అయితే సరిహద్దు కి దూరంగా వెళ్లారు. కొందరినీ భారత ప్రభుత్వమే సుదూర ప్రాంతాలకు తరలించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 28 మంది మరణించారు. దీంతో ఆగ్రహం చెందిన భారత్.. ఉగ్రవాదులను ఏరివేతకు ఆపరేషన్ సిందూర్ ని ఏర్పాటు చేసి.. పాక్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది.
Also Read : Shreyas Iyer : ఐపీఎల్ చరిత్రలోనే అయ్యర్ సరికొత్త రికార్డు..3 జట్లకు ప్రాణం పోశాడు
దీంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు సగానికి పైగా హతమయ్యారని సమాచారం. కీలక సూత్రదారులు మాత్రం పాక్ నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అప్రిదికి ఓ షీల్డ్ అందజేశారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ ఆర్మీ అధికారి మునీర్ ను తాజాగా కలిశాడు అఫ్రిది. అలాగే షోయబ్ అక్తర్ కూడా ఆర్మి అధికారిని కలిశాడు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారి మునిర్ కి కిస్ అండ్ హాగ్ ఇచ్చాడు ఆఫ్రీది. దీంతో ఆఫ్రిది హిజ్రా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇండియా పై పాకిస్తాన్ విజయం సాధించిందని సంబరాలు చేసుకునే క్రమంలో ఇది జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఓటమికి కూడా అప్రిది కారణం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆపరేషన్ సిందూర్ పై ఇన్నాళ్లు బుకాయించినటువంటి పాకిస్తాన్ తాజాగా అసలు నిజాలను బయటపెట్టింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివరించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ద విమానాలను ఉపయోగించిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ – పాక్ కాశ్మీర్ తో సహా తమ మధ్య ఉన్నటువంటి విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. ప్రధాని షరీఫ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం షాహిది అప్రిదీ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో షీల్డ్ అందుకోవడం.. ఆర్మీ అధికారి మునిర్ కి కిస్ అండ్ హాగ్ ఇవ్వడం.. పక్కనే మాజీ పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ కనిపించే ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Asim Munir and Shahid Afridi pic.twitter.com/YiLb9f5PsM
— IndiaWarMonitor (@IndiaWarMonitor) May 17, 2025