Lady Aghori: లేడీ అఘోరీ రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని ఓ మహిళా సినీ నిర్మాత మోకిల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అఘోరీ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.
వర్షిణి కోసం అఘోరీ శ్రీనివాస్ అరుపులు, కేకలు
అయితే, అఘోరీ శ్రీనివాస్ జైలులో సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో అఘోరీ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అఘోరీ రెండుసార్లు లింగమార్పిడి చేయించుకున్నాడు. ఇప్పుడు జైలులో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలకు లోనవుతున్నట్టు సమాచారం. జైలులో వర్షిణిని తలుకుంటూ అరుపులు, కేకలు వేస్తున్నాడు.
Also Read: Supreme Court: శ్రీలంక శరణార్థులపై సుప్రీం సంచలన తీర్పు
చంచల్ గూడ జైలుకు తల్లిదండ్రులు ములాఖత్‌కు వెళ్లినా అఘోరీ మాట్లాడడం లేదు. ఒక్కసారైనా వర్షిణిని చూపించాలని అఘోరీ శ్రీనివాస్ పోలీసులు వేడుకుంటున్నాడు. గత వారం రోజుల నుంచి అతను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. నోట్లో నుంచి రక్తం కక్కుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అఘోరీ శ్రీనివాస్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అనారోగ్య కారణంగా అఘోరీ శ్రీనివాస్‌కు బెయిల్ వస్తుందా..? లేదా..? అని చూడాలి.
అఘోరీకి బెయిల్ వచ్చేనా..?
అయితే, అఘోరీ శ్రీనివాస్ ఎంత అరుపులు, కేకలు వేసినా.. వర్షిణిని మాత్రం తన దగ్గరకి తీసుకోవడం లేదు. అఘోరీ వద్దకు తీసుకుపోతే.. వర్షిణి మైండ్ సెట్ ఛేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వర్షణిని అఘోరీ శ్రీనివాస్‌కు దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఒకవేళ అఘోరీ బెయిల్ వస్తే.. మళ్లీ జనాలను మోసం చేసే అవకాశం లేకపోలేదు. మళ్లీ శ్రీవర్షణిని వెంటపెట్టుకుని ఏటైనా తీసుకువెళ్లే అవకాశం ఉందని.. సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అఘోరీ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: Namrata Shirodkar Sister: హీరో మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం.. జాగ్రత్త అంటూ సందేశం..