Shahid Afridi: మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026 ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే 18 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. అయితే ఈ ప్రపంచ కప్ ప్రారంభమైన నుంచి చెత్త ప్రదర్శన కనబరిచింది పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan women’s team). వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఈ క్రమంలో టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది పాకిస్తాన్. అయితే, మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎనిమినేట్ అయిన నేపథ్యంలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు మాజీ క్రికెటర్లు. లేటెస్ట్ గా మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లకు… వంటలు చేయడం తప్ప, ఏ పని చేతకాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ ఆడమంటే… మా వాళ్లు కర్ర బిళ్ల ఆడుతున్నారని మండిపడ్డారు. అందుకే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినట్లు చురకలు అంటించారు షాహిద్ అఫ్రిది. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. ఈ టోర్నమెంట్ లో మొదటగా టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మొన్న బంగ్లాదేశ్ లాంటి బలహీనమైన జట్టు చేతులో కూడా పాకిస్తాన్ చిత్తయింది. ఈ క్రమంలో వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఈ దెబ్బకు T20 మహిళల ప్రపంచ కప్ 2028 ఆతిథ్య హక్కులను కూడా కోల్పోయింది.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో షాహిద్ అఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ క్రికెటర్లకు వంటింట్లో కూరలు తప్ప.. క్రికెట్ ఆడటం చేతకాలని మండిపడ్డారు. ఇతర జట్ల లాగా దూకుడుగా ఆడలేరని సెటైర్లు పేల్చారు. ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా కూడా… పాకిస్తాన్ ప్లేయర్లు వినియోగించుకోవడంలేదని సీరియస్ అయ్యారు. ఇలాంటి క్రికెటర్లకు మళ్లీ అవకాశం ఇవ్వకుండా.. వంటింటికి మాత్రమే పరిమితం చేయాలని చురకలు అంటించారు. పాకిస్తాన్ పరువు తీసిన ఈ క్రికెటర్లకు తగిన శిక్ష విధించాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును డిమాండ్ చేశారు. ఐసీసీ టోర్నమెంట్లలో దూకుడుగా ఆడే క్రికెటర్లను మాత్రమే సెలెక్ట్ చేయాలని కోరారు.