E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజంకు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇవ్వాల్సిందే…లేక‌పోతే ICCని రోడ్డుకు ఇడ్చుతా!

బాబ‌ర్ ఆజంకు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇవ్వాల్సిందే…లేక‌పోతే ICCని రోడ్డుకు ఇడ్చుతా!
Advertisement

Tanveer Ahmed On ICC:  వెస్టిండీస్ పై పాకిస్తాన్ రెండో టెస్టు విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. షాన్ మసూద్ ను పక్కకు పెట్టి బాబర్ ఆజంకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వగా… దీన్ని సక్రమంగా నిర్వర్తించాడు. ఈ క్రమంలోనే నిన్న ముగిసిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం నమోదు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో బాబర్ వన్ మ్యాన్ షో స్పష్టంగా కనిపించింది. అంతేకాదు రెండో టెస్టు మ్యాచ్ లో రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించాడు. సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ రియల్ హీరోగా మారిపోయాడు. దీంతో బాబర్ ఆజం పైన (Babar Azam) సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

బాబ‌ర్ ఆజంకు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇవ్వాల్సిందే

ఇంతలోనే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) తన నోటి దూలను మరోసారి బయటపెట్టారు. వెస్టిండీస్ పై పాకిస్తాన్ ను గెలిపించిన బాబర్ ఆజంను మెచ్చుకుంటూ… మూడు ఫార్మాట్లలో అతనికి నెంబర్ వన్ స్థానం ఇవ్వాల్సిందేనని ఐసీసీని డిమాండ్ చేశారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ  ( Vaibhav Suryavanshi) రెండు అర్థ సెంచరీలు చేస్తేనే… 48వ ర్యాంకు ఇచ్చారు… ఇప్పుడు బాబర్ ఆజంకు అన్ని ఫార్మాట్స్ ల‌లో నెంబర్ వన్ స్థానం ఇవ్వాల్సిందేనని మొండి ప‌ట్టు ప‌ట్టారు.

Advertisement

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైభ‌వ్ కు ఓ న్యాయం? బాబ‌ర్ కు ఓ న్యాయ‌మా?

వెస్టిండీస్ పై పాకిస్తాన్ జట్టును గెలిపించిన బాబర్ ఆజంను ( Babar Azam) ప్రశంసించిన తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed Pak) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్క మ్యాచ్ లో గెలిపించిన బాబర్ ఆజంకు టి20 లు, వన్డేలు అలాగే టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెంబర్ వన్ స్థానానికి బాబర్ ఆజం ఒక్కడే అర్హుడని గుర్తు చేశారు. మూడు సంవత్సరాల తర్వాత విదేశీ గడ్డపై పాకిస్తాన్ జట్టును గెలిపించిన మొనగాడు అంటూ కితాబిచ్చారు. అలాంటోడికి నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చినా కూడా తక్కువైనని వెల్లడించారు. ఐసీసీ వెంటనే దీనిపైన దృష్టి పెట్టాలని కోరారు.

Advertisement

వైభవ్ సూర్య వంశీ టీ20లలో రెండు అర్థ సెంచరీలు చేసినందుకే.. 48వ ర్యాంకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. 270 స్థానంలో ఉన్న వైభవ్ సూర్యవంశీకి 48వ స్థానం ఇవ్వడం ఎంత కరెక్టో…. బాబర్ ఆజం కు నెంబర్ వన్ ర్యాంక్ ఇవ్వడం అంతే కరెక్ట్ అన్నారు. బాబర్ ఆజం కు నెంబర్ వన్ ర్యాంక్స్ ఇవ్వకపోతే ఐసీసీ ని రోడ్డుకు ఈడ్చుతా అని హెచ్చరించారు తన్వీర్ అహ్మద్. ఈ విష‌యంలో తాను, అస్స‌లు త‌గ్గ‌బోను అంటూ హెచ్చ‌రించారు. ఐసీసీ దిగిరావాల్సిందేన‌ని తెలిపారు.

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

 

Related News

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

Big Stories

Advertisement
×