BigTV English
Advertisement

Shardul Thakur: 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్..నువ్వు రియల్‌ హీరో శార్దూల్‌!

Shardul Thakur: 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్..నువ్వు రియల్‌ హీరో శార్దూల్‌!

Shardul Thakur Hospitalised Following Gritty Knock For Mumbai In Irani Cup 2024 : టీమిండియా స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్‌ గురించి తెలియని వారుండరు. అయితే.. అలాంటి ఆల్‌ రౌండర్‌ శార్దూల్…. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడం జరిగింది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శార్దూల్ లక్నోలోని ఓ స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు “ది ఇండియన్ ఎక్స్ప్రెస్” తెలియజేసింది. కాగా, 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ బుధవారం ఇరానీ కప్ లో భాగంగా లక్నో వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున శార్దూల్ ఆడాడు. అజేయ ద్విశతకంతో మెరిసిన సర్పరాజు ఖాన్ తో కలిసి శార్దూల్ (36) తొమ్మిదవ వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.


Also Read: Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

మ్యాచ్ మొదటి రోజు శార్దూల్ తేలికపాటి జ్వరంతో బాధపడ్డాడు. అయితే రెండో రోజు దాదాపు రెండు గంటల పాటు బ్యాటింగ్ చేసిన అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దిగజారింది. దాంతో ఈ ఆల్ రౌండర్ ఇన్నింగ్స్ మధ్యలోనే రెండుసార్లు విరామం తీసుకున్నాడు. జ్వరంతోనే బ్యాటింగ్ చేసి ఆటపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. శార్దుల్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే ముంబై టీం మేనేజ్మెంట్ అతడిని సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.


Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

ఆ రోజు రాత్రి ఆసుపత్రిలో వైద్యుల బృందం అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది. ఇప్పటికే శార్దుల్ కు డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలకు సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం శార్దుల్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలని అతని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే.. టీమిండియా స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్‌ 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ క్రికెట్ ఆడడంపై ఫ్యాన్స్‌ వింతగా రియాక్ట్‌ అవుతున్నారు. క్రికెట్‌ లో రియల్‌ అంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్‌ ను మెచ్చుకుంటున్నారు.

Related News

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌,Mega వేలంషెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

SRH -IPL 2026: హైద‌రాబాద్ ఫ్యాన్స్ కు షాక్‌… కాటేర‌మ్మ కొడుకును గెంటేస్తున్న కావ్య పాప ?

IND VS SA: ఇంత‌కీ ఈ చిన్నారి ఎవ‌రు.. వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎందుకు వైర‌ల్ అయింది?

Jemimah Rodrigues: మరోసారి దొరికిపోయిన జెమిమా… హిందూ ధర్మాన్ని అవమానిస్తూ!

IPL 2026-KKR: కేకేఆర్ లో వేలుపెట్టిన గంభీర్‌…హ‌ర్షిత్ రాణాకు కెప్టెన్సీ ?

IND VS SA: నీకు సిగ్గుందా.. ఏబీ డివిలియర్స్ పై న‌టి హాట్ కామెంట్స్‌.. ఇండియాకే వెళ్లిపో !

Big Stories

×