WI vs AUS Test: మూడు టెస్ట్ లు, 5 టి-20 మ్యాచ్ ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జూన్ 25న తొలి టెస్ట్ ప్రారంభమైంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పూర్తిగా బౌలర్ల హవా కనిపిస్తోంది. తొలి రెండు రోజుల్లో ఏకంగా 28 వికెట్లు నేలకూలడంతో మూడవ రోజే ఆట ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొదటిరోజు బౌలర్లు చెలరేగి ఏకంగా 14 వికెట్లు తీయడంతో పాటు రెండవ రోజు కూడా ఇరుజట్ల బౌలర్లు చెలరేగి మరో 14 వికెట్లు తీశారు.
Also Read: Indian Cricketers: టీమిండియా ప్లేయర్ అరాచకం.. ఒక్క దేశానికి ఒక్క అమ్మాయిని..!
దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసింది. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో 92 పరుగుల ఆదిక్యంలో ఉంది. క్రీజ్ లో వెబ్ స్టర్ {21*}, ట్రావీస్ హెడ్ {21*} ఉన్నారు. మూడవరోజు ఆస్ట్రేలియా మిగతా ఆరు వికెట్లను త్వరగా పడగొడితే.. ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ తొలి టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను వెస్టిండీస్ ప్లేయర్లు జేడెన్ సీల్స్, షమార్ జోసెఫ్ వనికించారు.
వీరిద్దరూ కలిసి ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో.. వీరి ధాటికి ఆస్ట్రేలియా కేవలం 180 పరుగులకే కుప్పకూలింది. గడిచిన 30 ఏళ్లలో వెస్టిండీస్ పై తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యంత తక్కువ స్కోర్. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కేవలం నలుగురు తప్ప.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్ లకే పరిమితమయ్యారు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ కూడా ఆస్ట్రేలియా తరహాలోనే వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 57 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది వెస్టిండీస్. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ కి వెస్టిండీస్ ఇంకా 123 పరుగుల వెనకబడింది.
రెండో రోజు కూడా బౌలర్ల హవానే కొనసాగింది. నిజానికి బార్బడోస్ లోని ఈ స్టేడియంలో బ్యాట్స్మెన్, బౌలర్లు ఇద్దరూ ఆధిపత్యం చెలాయిస్తారు. ఇక్కడ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు ఎక్కువగా సహాయం లభిస్తుంది. ఫాస్ట్ బౌలర్లు కూడా కొంత స్వింగ్ పొందుతారు. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కారణంగా ఇక్కడ 150 కి పైగా సులభంగా పరుగులు రాబట్టవచ్చు. సాధారణంగా ఇక్కడి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ లలో ఎక్కువగా మొదట బ్యాటింగ్ చేసిన జెట్టే గెలుపొందింది.
Also Read: Mohammad Shami: టీమిండియా బౌలర్లు దేనికి పనికిరారు.. నన్ను తీసుకున్నా.. గెలిచేవాళ్లం
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బార్బడోస్ మైదానానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. మైదానం బయట ప్రేక్షకులు మ్యాచ్ ని వీక్షించేందుకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బీచ్ లో మ్యాచ్ చూస్తూ ఈ మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు క్రీడాభిమానులు. మైదానం బయట ఏకంగా బిర్యానీలు తింటూ, బీర్లు తాగుతూ ప్రేక్షకులు మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన క్రీడాభిమానులు.. “ఇది కదా అసలు మజా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.