Ishan Kishan Run Out Controversy: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs India) మధ్య బుధవారం రోజున టి20 సిరీస్ (India tour of England, 2026 ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో బుధవారం తొలి మ్యాచ్ జరగగా… వర్షం అడ్డంకిగా మారింది. తొలి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత జోరుగా వర్షం పడింది. ఈ క్రమంలోనే మొదటి టీ20ని రద్దు చేస్తూ ఓ నిర్ణయానికి వచ్చారు అంపైర్లు. దీంతో స్టేడియానికి వచ్చిన అభిమానులు అందరూ నిరాశతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ తొలి టి20 నేపథ్యంలో అభిషేక్ శర్మ(Abhishek Sharma ), ఇషాన్ కిషన్ (Ishan Kishan)మధ్య గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. నీ వల్లే తాను రనౌట్ (Ishan Kishan run-out ) అయ్యానంటూ… అభిషేక్ శర్మపై ఇషాన్ కిషన్ సీరియస్ అయినట్లు వీడియోలు స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య బుధవారం రోజున తొలి టి20 జరగగా… వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి20 మొదటి మ్యాచ్ నేపథ్యంలో మనోళ్లు మొదటి బ్యాటింగ్ చేశారు. సంజు శాంసన్ ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ దారిపట్టాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ఐసీసీ టి20 నెంబర్ వన్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. డకౌట్ అయ్యాడు. ఫ్రంట్ ఫీల్డర్ వైపు బంతిని కొట్టి… వేగంగా పరుగు తీసేందుకు ప్రయత్నించారు ఇషాన్ కిషన్. అయితే అది గ్రహించిన అభిషేక్ శర్మ, పరుగు కోసం వెళ్లకుండా బౌలర్ ఎండ్ వైపు ఉన్నాడు. ఇక పిచ్ మధ్యలోకి వచ్చిన ఇషాన్ కిషన్, వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వికెట్ కీపర్ జోష్ బట్లర్ రనౌట్ చేశాడు.
ఈ సంఘటన తర్వాత అభిషేక్ శర్మపై ఇషాన్ కిషన్ కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు చోటు చేసుకున్న సంభాషణ కూడా వైరల్ గా మారింది. రనౌట్ కాగానే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించే ముందు… అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రనౌట్ అనంతరం మైదానంలోనే కూర్చున్న ఇషాన్… నీ వల్లే ఔట్ అయ్యానని అభిషేక్ శర్మ పై మండిపడ్డారు. నేను రమ్మన్నప్పుడు వస్తే… సింగిల్ వచ్చేదని పేర్కొన్నారు. అయితే అభిషేక్ శర్మ మాత్రం దానికి కౌంటర్ ఇచ్చారు. ఫీల్డర్ చేతిలోకి బంతి వెళ్లాక నేను ఎలా ? వస్తా అంటూ మండిపడ్డారు. అనవసరంగా నువ్వే వికెట్ పోగొట్టుకున్నామని ఇషాన్ కిషన్ కు రిప్లై ఇచ్చారు అభిషేక్ శర్మ. అయితే దీనిపై ఇషాన్ కిషన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మను దాటి మొదటి స్థానంలోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. అయితే ఈ కోపంతోనే ఇషాన్ కిషన్ ను రనౌట్ చేయించాడని అభిషేక్ పై ఫైర్ అవుతున్నారు.
A costly mix-up in the middle. 🫣
Moments after the run-out: Abhishek Sharma and Ishan Kishan share a brief conversation.#ENGvIND 1st T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/1kagvrBjV9
— Star Sports (@StarSportsIndia) July 1, 2026