E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

టీమిండియాను దెబ్బ‌కొట్టిన‌ జై మూండ్రాకు పాకిస్తాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌

టీమిండియాను దెబ్బ‌కొట్టిన‌ జై మూండ్రాకు పాకిస్తాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌
Advertisement

Jai Moondra In To PSL:  టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Team India vs. Ireland) మధ్య టీ20 సిరీస్ ( T20 Series) ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ లో టీమిండియా (Team India) వైట్ వాష్ అయింది. అయితే, ఈ సిరీస్ లో టీమిండియాను ఐర్లాండ్ లో సెటిల్ అయిన జై ముండ్రా (Jai Moondra ) దెబ్బతీశాడు. ఈ రెండు టీ20లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి.. టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలోనే జై ముండ్రా పేరు సోషల్ మీడియాలో మారుమగుతోంది. అంతేకాదు ఇతను రాజస్థాన్ రాష్ట్రంలో పుట్టి పెరిగి, ఐర్లాండ్ తరఫున ఆడుతున్నాడు. అయితే మొన్నటి టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాను దెబ్బతీసినందుకు గాను జై ముండ్రాకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Pakistan Super League 2027 Tournament) నేపథ్యంలో ఆడితే రూ.20 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియాను దెబ్బ కొట్టాడు అన్న ఒక్క కారణంతో, జై ముండ్రా (Jai Moondra )కు ఈ ఆఫ‌ర్ ఇచ్చిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

ఇంత‌కు ఎవ‌రీ జై మూండ్రా ?

Advertisement

ఐర్లాండ్ తరఫున ఆడుతున్న జై ముండ్రా మన భారతీయుడే. 1997 సంవత్సరంలో రాజస్థాన్ లోని తోంకు అనే ప్రాంతంలో జన్మించాడు ముండ్రా. గతంలో రాజస్థాన్ లోని డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాడు. అయితే చెన్నైలో చదివిన ఇతను.. మాస్టర్స్ డిగ్రీ కోసం ఐర్లాండ్ వెళ్ళాడు. అక్కడే జాబ్ చేసుకుంటూ, క్రికెట్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ జాతీయ జట్టులో స్థానం కూడా దక్కించుకున్నాడు జై ముండ్రా. ఏడాది కిందటే ఐర్లాండ్ పౌరసత్వం కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. వచ్చి రాగానే టీమిండియానే దెబ్బ కొట్టాడు. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన టి20 సిరీస్ నేపథ్యంలో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు జై ముండ్రా.

జై ముండ్రాకు పాకిస్తాన్ బంపర్ ఆఫర్

ఇండియాను దెబ్బ కొట్టినందుకు ఐర్లాండ్లో సెటిల్ అయిన జై ముండ్రాకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చిందట. వచ్చే 2027 పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో ఏదో ఒక ఫ్రాంచైజీ తరఫున 20 కోట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిందట. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ ఆడకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడాలని కండిషన్స్ పెట్టిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Advertisement

 

 

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

 

Related News

ఇంగ్లండ్ సిరీస్ లో న‌న్ను స‌రిగ్గా వాడుకోలేదు..బౌలింగ్ కూడా ఇవ్వ‌లేదు

Daryll Cullinan: టీమిండియాలో ఆడ‌టం నీ వ‌ల్ల కాదు..వెళ్లి గ‌ల్లీ క్రికెట్ ఆడుకో

వైభ‌వ్ బాగా ఆడ‌తాడ‌ని టీమిండియా ప్లేయ‌ర్లే అరంగేట్రం ఆపుతున్నారు

ముసుగులు వేసుకుని, పాకిస్తాన్ లో తిర‌గండి..లేక‌పోతే రాళ్ల‌తో కొడ‌తారు

టీమిండియాలో ‘ఒక్కడు’ సరిగ్గా లేడు, వైట్ వాష్ చేయండి..ఈ ఛాన్స్ వ‌దులుకోవ‌ద్దు

ఇంగ్లాండ్ లో వైభ‌వ్ కు అవ‌మానం, ర్యాగింగ్ చేసిన అమ్మాయిలు..ముఖం చాటేసిన బుడ్డోడు

PCB కీలక నిర్ణయం..ఇకపై పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు

Big Stories

×