
Minister Roja latest news(AP political news):
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్ కె రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఒక ప్రేమ జంట రాష్ట్ర డీజీపికి ఫిర్యదు చేసింది. తమకు ఎక్కడికెళ్లినా రక్షణ లేదని.. పోలీసులకు ఆశ్రయించినా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ అనే యువతి.. నెల్లూరుకు చెందిన జిలానీ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రవీణ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఆ తరువాత ప్రవీణకు పెళ్లి సంబంధాలను చూడటం ప్రారంభించారు. దీంతో ప్రవీణ ఇంటి నుంచి పారిపోయి, ప్రియుడు జిలానీని పెళ్లి చేసుకుంది.
ఆ తరువాత నుంచి ప్రేమికులిద్దరికీ ప్రవీణ బంధువల నుంచి చంపేస్తామంటూ.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ప్రవీణ, జిలానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ మంత్రి రోజా ఈ వ్యవహారంలో కలుగజేసుకొని.. ఆ ప్రేమ జంటకు రక్షణ కల్పించవద్దని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ప్రేమికలు ఆరోపించారు. పోలీసులు కూడా తమను కాపాడలేరేమోనని భయపడి ప్రవీణ, జిలానీలు డిజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో మంత్రి రోజా నుంచి కూడా ప్రాణహాని ఉన్నటలు పేర్కొన్నారు.