Shubman Gill: టీమిండియా స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గిల్ అతి తక్కువ సమయంలోనే మంచి ఫామ్ కనబరిచాడు. తన అద్భుతమైన ఆట తీరుతో ప్రతి ఒక్కరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అలాగే టీమ్ ఇండియా టెస్టులకు కెప్టెన్ గా కొనసాగుతున్నారు. త్వరలోనే టీ20 వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతోంది. ఈ నేపద్యంలోనే శుభమన్ గిల్ కు టి20 వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. అతి త్వరలోనే గిల్ ను వన్డే కెప్టెన్ గా చేస్తారని తెలుస్తోంది. ఓవరాల్ గా గిల్ ను టెస్టులు, t20లు, వన్డేలకు కెప్టెన్ గా చేస్తారని తెలుస్తోంది. క్రికెట్ రంగంలో ఎంతో అద్భుతంగా రాణించే గిల్ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్సమ్ లుక్స్ తో ప్రతి ఒక్కరి చూపును తనవైపుకు తిప్పుకుంటాడు.
గిల్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే… ఇతడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించారు. బయట కూడా చాలా సందర్భాలలో కలిసి తిరిగారు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ ఆ విషయం పైన గిల్, సారా టెండూల్కర్ ఇంతవరకు స్పందించలేదు. ఇక ఏమైందో తెలియదు గత కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి తగినట్లుగానే గిల్ వేరే అమ్మాయితో, సారా టెండూల్కర్ వేరే అబ్బాయితో కలిసి తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో దర్శనం ఇస్తున్నాయి. దీంతో వీరిద్దరూ నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం అందుతోంది.
గిల్ సారాతో కాకుండా అంతకుముందు వేరే అమ్మాయితో కూడా రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో గిల్ టాలీవుడ్ స్టార్ నటి మృనాల్ ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ గత కొద్ది రోజుల నుంచి సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం గిల్ కు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపైన గిల్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.