BigTV English

OTT Movie : ప్లే స్టేషన్ లో పెద్దల గేమ్… ఒక్కో సీన్ కు చెమటలు పట్టాల్సిందే మావా… గుండెలదిరే హర్రర్ మూవీ

OTT Movie : ప్లే స్టేషన్ లో పెద్దల గేమ్… ఒక్కో సీన్ కు చెమటలు పట్టాల్సిందే మావా… గుండెలదిరే హర్రర్ మూవీ

OTT Movie : హారర్ అభిమానులకు గుండెను ఝల్లుమనిపించే ఒక సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ఒక వీడియో గేమ్ చుట్టూ తిరుగుతుంది. కొంతమంది ఈ భయంకరమైన వీడియో గేమ్‌లో చిక్కుకుంటారు. ఈ గేమ్‌లో చనిపోతే, నిజ జీవితంలో కూడా చనిపోతుంటారు. ఈ శాపంతో ఈ కథ గుండెను కంపించేలా చేస్తుంది. గేమింగ్, హారర్‌ను కలిపి ఒక చిల్లింగ్ థ్రిల్‌ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

లూమిస్ క్రౌలీ అనే యువకుడు స్టే అలైవ్ అనే వీడియో గేమ్ ఆడుతాడు. అయితే గేమ్‌లో అతని పాత్ర చనిపోతుంది. అదే విధంగా అతను వాస్తవంలో కూడా ఉరేసుకుని చనిపోతాడు. ఆతరువాత లూమిస్ స్నేహితుడు హచ్ ఓ’నీల్ ఈ గేమ్‌ను తీసుకొని, తన స్నేహితులు అబిగైల్, అక్టోబర్ బెన్స్ , ఫినియస్, స్వింక్ స్కోలెవ్స్కీ, మిల్లర్ బ్యాంక్స్ తో కలిసి ఆడటం మొదలుపెడతాడు. గేమ్ ఆడాలంటే, ముందుగా ఒక మంత్రం చదవాలి. ఇది కౌంటెస్ ఎలిజబెత్ బాతోరీ అనే రక్త పిపాసి ఆత్మను మేల్కొనేలా చేస్తుంది. ఈ గేమ్‌లో జెరౌజ్ ప్లాంటేషన్ అనే భయంకరమైన ఇంట్లో, వీళ్ళంతా పిల్ల దెయ్యాలతో పోరాడతారు. మిల్లర్ గేమ్‌లో చనిపోయిన తర్వాత, వాస్తవంలో కత్తెరతో హత్యకు గురవుతాడు. అప్పుడు వారికి అర్థమవుతుంది. —గేమ్‌లో చనిపోతే, నిజ జీవితంలో కూడా చనిపోతారని!


అక్టోబర్ బెన్స్ బాతోరీ ఆత్మ గురించి తెలుసుకుంటుంది. ఆమె ఒకప్పుడు యువతుల రక్తంలో స్నానం చేసి యవ్వనంగా ఉండేదని, అద్దాలు ఆమె బలహీనత అని తెలుసుకుంటుంది. ఇంతలో ఫినియస్ భయపడి గేమ్ ఆడకుండా వదిలి వెళ్ళిపోతాడు. అయితే గేమ్ వదిలినా కూడా గుర్రపు బండితో ఢీకొని చనిపోతాడు. ఇక ఈ కేసును ఇన్వెస్టిగేషన్ కి వచ్చిన డిటెక్టివ్ ని, ఈ డెత్ గేమ్ ను ఆడొద్దని స్వింక్ హెచ్చరిస్తుంది. ఈ డిటెక్టివ్ ఆమె హెచ్చరికలు పట్టించుకోకుండా గేమ్ ఆడి అతనూ చనిపోతాడు. ఇప్పుడు హచ్, అబిగైల్, స్వింక్ జెరౌజ్ ప్లాంటేషన్‌కు వెళ్లి, బాతోరీ సమాధిని కనిపెడతారు. హచ్ ఆమె శరీరంలో మూడు మేకులు గుచ్చి ఆత్మను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె మళ్లీ లేస్తుంది. ఇక క్లైమాక్స్ భయంకరమైన వణుకు పుట్టించే సీన్స్ తో ముగుస్తుంది. ఈ ఆత్మను వీళ్లంతా కలసి అంతం చేస్తారా ? ఈ గేమ్ మళ్ళీ ప్రాణాలను తీస్తుందా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

మూడు ఓటీటీలలో

‘స్టే అలైవ్’ (Stay Alive) ఒక అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ చిత్రం. విలియం బ్రెంట్ బెల్ దర్శకత్వంలో తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 85 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.1/10 రేటింగ్ ను పొందింది.

Related News

OTT Movie : మనిషి మాంసం కోసం తీరని ఆకలితో… ఈ ఊళ్ళో అడుగు పెడితే కీమా అయినట్టే… మతిపోగోట్టే ట్విస్టులు

OTT Movie : వింత ప్రాణులతో డీల్… ఆ ఒక్క పొరపాటుతో ఊరు జనాల్ని చీల్చి చెండాడే పిశాచాలు… సింగిల్ గా చూడొద్దు మావా

OTT Movie : స్టార్ హీరోయిన్ తో పాడు పనులకు ప్లాన్… సెన్సారోళ్లే నోరెళ్ళబెట్టిన సినిమా… ఇంకా చూడలేదా మావా?

OTT Movie : నిషిద్ధ ప్లేస్ కు వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకునే తల్లి… పిల్లను బలి కోరే పిశాచి… ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : ఈ కాలేజ్ లో పిల్లలంతా ఆ ఆట ఆడాల్సిందే… గ్యాప్ లేకుండా పాడు సీన్లు… దిమాక్ కరాబ్ చేసే డార్క్ కామెడీ

Big Stories

×