ICC ODI Batsmen Rankings: తాజాగా ఐసీసీ పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది. ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. 786 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు బాబర్ అజామ్. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా భారత ఆటగాళ్లు {ICC ODI Batsmen Rankings} ర్యాంకింగ్స్ లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా నాలుగవ స్థానంలో ఉన్న శుబ్ మన్ గిల్ రెండు స్థానాలు ఎగబాకి రెండవ స్థానంలో నిలిచాడు.
Also Read: Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ…ఆసియాలో తొలి ప్లేయర్ !
ఐర్లాండ్ ఆటగాడు హ్యారి టెక్టర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లను దాటి రెండవ స్థానంలో నిలిచాడు. 781 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు గిల్. ఇక {ICC ODI Batsmen Rankings} రెండవ స్థానంలో కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మెట్టు దిగి 773 పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక నాలుగవ స్థానంలో ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్, ఐదవ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు క్లాసెన్ నిలిచారు. అలాగే నాలుగవ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ రెండు స్థానాలు దిగజారి 728 పాయింట్లతో ఆరవ స్తానానికి చేరుకున్నాడు.
కాగా {ICC ODI Batsmen Rankings} 669 పాయింట్లతో శ్రేయస్ అయ్యర్ పదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలతో రాణించిన గిల్.. మూడవ వన్డేలోనూ హాఫ్ సెంచరీ సాధించి మరిన్ని పరుగుల వైపు దూసుకు వెళ్తున్నాడు. అలాగే 50 మ్యాచ్లలోనే 2500 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇలా అద్భుతంగా రానిస్తూ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో {ICC ODI Batsmen Rankings} రెండవ స్థానంలో నిలిచాడు.
Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఈ ప్రమాదకరమైన బౌలర్లు ఔట్.. టెన్షన్ లో ఐపీఎల్ ఓనర్స్ ?
ఇక రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ వన్డేలో 90 బంతులలోనే 119 పరుగులు చేసి ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. ఇక రోహిత్ కి వన్డేల్లో ఇది 32వ సెంచరీ. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో 49వ సెంచరీ. ఇక వన్డే టీం ర్యాంకింగ్స్ లో భారత జట్టు 5726 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 669 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో మహమ్మద్ సిరాజ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి పదవ స్థానానికి చేరుకోగా.. రవీంద్ర జడేజా 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఆల్రౌండర్ల విషయానికి వస్తే మరో అప్ఘనిస్తాన్ ప్లేయర్ మొహమ్మద్ నబీ 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 10వ స్థానంలో ఉన్నాడు.
🚨 GILL & ROHIT AT NO.2 AND NO.3. 🚨
📢 ICC ODI rankings:
1. Babar Azam – 786.
2. Shubman Gill – 781.
3. Rohit Sharma – 773. pic.twitter.com/2wwpojwtQe— Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2025