BigTV English

Rajinikanth: విజయ్‌పై దారుణమైన కామెంట్స్… ఉలిక్కిపడ్డ రజనీకాంత్, అసలు ఏమైంది?

Rajinikanth: విజయ్‌పై దారుణమైన కామెంట్స్… ఉలిక్కిపడ్డ రజనీకాంత్, అసలు ఏమైంది?

Rajinikanth : కోలీవుడ్ ఇండస్ట్రీలో తలైవా రజినీకాంత్ (Rajinikanth), దళపతి విజయ్ (Vijay) ఇద్దరూ బిగ్గెస్ట్ స్టార్స్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చాలా సంవత్సరాలుగా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఫలితంగా తరచుగా వీరిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. నిజానికి ఇటు రజినీకాంత్, అటు విజయ్ ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు గౌరవంతో మెలుగుతారు. కానీ అభిమానులు మాత్రం ఆన్లైన్ వార్ ఏమాత్రం వెనకాడరు. తాజాగా రజనీకాంత్ అభిమానిని అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో దళపతి విజయ్ పై అవమానకరమైన కామెంట్స్ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ విషయంపై రజినీకాంత్ టీం వెంటనే స్పందిస్తూ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది.


విజయ్ పై అభ్యంతరకర కామెంట్స్

తాజాగా విజయ్ (Vijay) పై రజినీకాంత్ (Rajinikanth)అభిమానిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ పై రజినీకాంత్ బృందం స్పందించింది. ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదని ఖండిస్తూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా రజినీకాంత్ ను ఆరాధ్య దైవంగా భావించే అభిమానులు, ఆయన పాటించే విలువలను నిలబెట్టుకోవాలని అభిమానులను కోరింది. విజయ్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ రిలీజ్ చేసిన ఆ ప్రకటనలో ‘ఈ కామెంట్స్ యాక్సెప్టబుల్ కాదు. నిజమైన రజనీకాంత్ అభిమానులు పాటించే సూత్రాలకు ఇది కంప్లీట్ గా విరుద్ధం. ఇలాంటి హానికరమైన కంటెంట్ ను పదేపదే షేర్ చేయడం వల్ల శత్రుత్వం అనేది పెరిగిపోతుంది. మీడియా సోషల్ నెట్వర్క్ లు ఇలాంటి వాటికి బాధ్యత వహించాలి. ఇటువంటి సంఘటనలను కొనసాగించకుండా చూసుకోవాలి” అని అందులో పేర్కొన్నారు.


విజయ్ తో ఎలాంటి వైరం లేదన్న రజనీకాంత్

రజనీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay) మధ్య పోటీ ఉందనే ఊహాగానాలు చాలా సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాల విషయంలో అభిమానుల కారణంగా ఇద్దరి మధ్య శత్రుత్వం నడుస్తోందనే రూమర్లు ఎన్నోసార్లు వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా రజనీకాంత్ విజయ్ పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేసింది లేదు. ‘లాల్ సలాం’ మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా రజినీకాంత్ గతంలో జరిగిన అంశాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్ సందర్భంగా విజయ్ కి తనకి మధ్య ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ ఇద్దరి దారులు వేరని ఆయన అన్నారు. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఇలా సోషల్ మీడియా వేదికగా కొట్టుకోవడం చర్చకు దారి తీసింది. టాలీవుడ్ లో కూడా అభిమానులు అప్పుడప్పుడూ స్టార్స్ కు ఇలాంటి కష్టాలు తెస్తూ ఉంటారు.

కాగా ప్రస్తుతం రజినీకాంత్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’, నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి ‘జైలర్ 2’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టారు. ‘జన నాయగన్’ అనే సినిమాతో మూవీ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఇదే ఆయన చివరి సినిమా కానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×