BigTV English

Shubman Gill : పాకిస్తాన్ క్రికెటర్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్.. ఆసియాలోనే తొలి బ్యాటర్ గా

Shubman Gill :  పాకిస్తాన్ క్రికెటర్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్.. ఆసియాలోనే తొలి బ్యాటర్ గా

Shubman Gill :   టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (IND Vs ENG)  మధ్య ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ టీమిండియా (Team India)  358 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసి 311 పరుగుల లీడ్ లో కొనసాగింది. దీంతో టీమిండియా బ్యాటర్లు పరుగులు చేసేందుకు పోరాడుతున్నారు. ప్రస్తుతం శుబ్ మన్ గిల్, కే.ఎల్. రాహుల్ క్రీజులో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి ఈ ఫీట్ నమోదు చేశాడు. 


Also Read :  Jasprit Bumrah : బుమ్రా రిటైర్మెంట్… ముహూర్తం ఎప్పుడు అంటే !

ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా కెప్టెన్ రికార్డు.. 


కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పడంతో భారత టెస్ట్ జట్టు కెప్టెన్ గా గిల్ పగ్గాలు చేపట్టాడు. అయితే అతని సారథ్యంలో టీమిండియా తొలుత  ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సారాథిగా తొలి ప్రయత్నంలో విఫలమైన గిల్.. బ్యాటర్ 147, 8గా అదురగొట్టాడు. ఇక రెండో టెస్టులో ఎడ్జ్ బాస్టన్ లో భారత్ ఇంగ్లాండ్ ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కీలక పాత్ర పోషించాడు. ఎడ్జ్ బాస్టన్ లో డబుల్ సెంచరీ.. సెంచరీతో చెలరేగాడు. 269, 161 పరుగులు చేశాడు గిల్. లార్డ్స్ టెస్టులో  16, 6 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. తాజాగా మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో గిల్ తొలి ఇన్నింగ్స్ లో విఫలమయ్యాడు.  కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న గిల్.. 12 పరుగులు చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం గిల్ పర్వాలేదనిపించాడు.

తొలి ఆసియా బ్యాటర్ గా.. 

శనివారం నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. టీమిండియా(Team India)  82 పరుగులు చేసింది. ఈ తరుణంలో ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్ గా అవతరించాడు. ఈ ఇన్నింగ్స్ లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్.. యూసఫ్ ను అధిగమించాడు. శుబ్ మన్ గిల్ 645 2025లో.. అత్యుత్తమ స్కోర్ 269 పరుగులు. మొహమ్మద్ యూసఫ్ 631.. 2006లో.. అత్యుత్తమ స్కోర్ 202. రాహుల్ ద్రవిడ్ 602 పరుగులు.. 2002లో అత్యుత్తమ స్కోరు 217. విరాట్ కోహ్లీ 593-2018లో అత్యుత్తమ స్కోర్ 149, సునీల్ గవాస్కర్ 542-1979లో అత్యుత్తమ స్కోర్ 221 కావడం విశేషం. ప్రస్తుతం గిల్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. గిల్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. ఇంకా పరుగులు చేసే అవకాశం ఉంది. ఇంకో టెస్ట్ కూడా మిగిలి ఉండటంతో గిల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టం అనే చెప్పాలి.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×