BigTV English

Shubman Gill : ‘బాగా ఆడితే ప్రశంసిస్తారు.. లేదంటే విమర్శిస్తారు..’

Shubman Gill : ‘బాగా ఆడితే ప్రశంసిస్తారు.. లేదంటే విమర్శిస్తారు..’

Shubhman Gill About His Performance :


“నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరే…

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…”
                                    -శ్రీశ్రీ


మహాకవి శ్రీశ్రీ రాసిన కవిత్వం, ఎన్నేళ్లయినా సజీవంగానే ఉంటుంది. అందుకు ఉదాహరణ. టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ అని చెప్పాలి.  ఫామ్ కోల్పోయి, తిరిగి లయ అందుకోలేక సతమతమవుతూ ఇంటా బయటా అవమానాలు ఎదుర్కొంటూ, పడరాని పాట్లు పడిన గిల్ ఎట్టకేలకు రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. 

టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో నిన్నటి వరకు తిట్టిన నోళ్లే, నేడు గొప్పవాడని పొగుడుతున్నాయి, ఇదే సత్యాన్ని, జనం తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన వాడు శ్రీశ్రీ…అందుకే మహాకవి అయ్యాడు.

 తన సెంచరీపై గిల్ మాట్లాడుతూ మనం బాగా ఆడితే ప్రశంసిస్తారు. లేకపోతే వేరే విధంగా మాట్లాడతారని నిర్వేదంగా మాట్లాడాడు. నిజానికి తను సెంచరీ చేసిన తర్వాత ముందున్నంత సంతోషం తనలో వ్యక్తం కాలేదు. తన మార్క్ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. కళ్లల్లో చిన్నతడి మాత్రం కనిపించింది.

Read More : ముంబయి ఇండియన్స్ కోచ్ వర్సెస్ రోహిత్ భార్య!

ఇంకా మాట్లాడుతూ ఇదంతా ఆటలో ఒక భాగంగానే చూడాలని అన్నాడు. ఇవన్నీ డ్రెస్సింగ్ రూమ్ లో సీనియర్లు చెబుతుంటారు. వారి అనుభవంలో ఇలాంటివెన్నో చూస్తుంటారు. అందుకే వారు చెప్పేది ఏమిటంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులకు తగినట్టుగా ఆడి జట్టు విజయానికి కృషి చేయాలి. ఆ సమయంలో ఎలా బ్యాటింగ్ చేయాలనేదే ముఖ్యమని అన్నాడు.

ఓపెనర్ పాత్ర వేరు, ఫాస్ట్ బౌలర్స్ ను ఈజీగా ఎదుర్కొంటాను, కానీ ఫస్ట్ డౌన్ లో ఉన్నప్పుడు ఉండే ఒత్తిడి వేరని తెలిపాడు. ఎందుకంటే ఓపెనర్ ఒక్కరు అవుట్ అయినా ప్రెజర్ ఫస్ట్ డౌన్ మీద ఉంటుంది. అదే ఓపెనర్ గా ఉంటే, స్వేచ్ఛగా ఆడవచ్చు. తర్వాత వాళ్లు ఉన్నారనే ధైర్యం ఉంటుంది. 

ఫస్ట్ డౌన్ కి వచ్చేసరికి ఒకేసారి ఇద్దరూ అవుట్ అయిపోతే, అదింకా ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుందని అన్నాడు. రెండో టెస్ట్ లో అదే జరిగింది. క్రీజులో ఉండి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని అనుకున్నాం. సెంచరీ చేయడం ఆనందంగా ఉందని అన్నాడు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×