Atlee – The Rock: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో గంగోత్రి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మొదట బన్నీ కెరీర్ లో కొన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్నాయి. అయినప్పటికీ బన్నీ ఏమాత్రం వెనుదిరగలేదు. వరుస పెట్టి సినిమాలలో నటించి తన సత్తాను చాటుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ కు విపరీతంగా అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల వద్ద భారీ హంగామా నెలకొంటుంది. అల్లు అర్జున్ రీసెంట్ గానే పుష్ప-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. తన కెరీర్ లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతేకాకుండా తెలుగు సినీ హిస్టరీలోనే మొదటిసారిగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. పుష్ప టు సినిమాకు సీక్వెల్ పుష్ప-3 సినిమా షూటింగ్ తొందరలోనే ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమా విడుదలై చాలా రోజులే అవుతున్నప్పటికీ అల్లు అర్జున్ పెద్దగా సినిమాలలో నటించడం లేదు.
కానీ తన తదుపరి సినిమాను డైరెక్టర్ అట్లీతో కలిసి తీయబోతున్నారు. ఈ సినిమాకు “AA 22” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ముంబైలో చిత్రీకరించారు. కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు.
Also Read: Virat – Anushka: కోహ్లీ, అనుష్క పై దారుణంగా ట్రోలింగ్.. ఇండియా మ్యాచ్ కు వెళ్లకుండా అక్కడికి జంప్!
కాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) లేదా రిటైర్డ్ WWE ది రాక్ ( The Rock) నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు విలన్ పాత్రను పోషించనున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇందులో హార్దిక్ పాండ్యా లేదా ది రాక్ ఎవరో ఒకరు విలన్ పాత్రలో నటిస్తే సినిమాకే ప్లేస్ అవుతుందని అట్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను హాలీవుడ్ (Holy wood) రేంజ్ లో నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.