BigTV English

SL vs IND ODI Highlights : అర్షదీపు.. ఎంత పని చేశావ్? : చెమటోడ్చిన భారత్.. శ్రీలంకతో మ్యాచ్ టై

SL vs IND ODI Highlights : అర్షదీపు.. ఎంత పని చేశావ్? : చెమటోడ్చిన భారత్.. శ్రీలంకతో మ్యాచ్ టై

SL vs IND 1st ODI Match Tied: ఒకనాటి శ్రీలంక జట్టుకి, నేటి జట్టుకి ఎంతో తేడా ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023 దగ్గర నుంచి చూస్తే, ప్రతీ చోటా ఓటమే..ప్రతీ సిరీస్ లోనూ ఓటమే. ఆఖరికి టీ 20 ప్రపంచకప్ లో కూడా ఘోరమైన పెర్ ఫార్మెన్స్ తో లీగ్ దశ నుంచే బయటకి వచ్చేసింది. అలాంటి శ్రీలంకతో టీ 20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన టీమ్ ఇండియా ఎలా ఆడిందంటే.. వింటే నవ్విపోతారు.


టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో తను కూడా 230 పరుగులే చేసి ఆలౌట్ అయిపోయింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది.

విషయానికి వస్తే.. 231 పరుగుల స్వల్ప టార్గెట్ ను చేధించడానికి టీమ్ ఇండియా ఆపసోపాలు పడింది. యోధానుయోధులైన క్రికెట్ వీరులందరూ ఉన్నారు. ఒక్క పరుగు చేస్తే చాలు గెలిచే స్థితిలో శివమ్ దుబె అవుట్ అయిపోయాడు.


ఇంక చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఒక్క పరుగే చేయాలి. ఇంకా 13 బంతులున్నాయి. అప్పుడు అర్షదీప్ సింగ్ వచ్చాడు. తను నిజంగానే బ్యాటింగ్ బాగా ఆడతాడు. అప్పటికే స్పిన్ బౌలింగుకి వికెట్లు పడిపోతుంటే, ఎంతో జాగ్రత్తగా డిఫెన్స్ ఆడి, ఒక్క పరుగు చేస్తే గెలిచే మ్యాచ్ ని చేజేతులారా, నిర్లక్ష్యపు షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు. అంతే మ్యాచ్ టై అయిపోయింది.

Also Read: హాకీలో భారత్ విజయం.. 52 ఏళ్లలో ఆస్ట్రేలియాపై గెలవడం ఇదే తొలిసారి

టీమ్ ఇండియా ఆటగాళ్ల ముఖాలు మాడిపోయాయి. మనవాళ్లు ఐదుగురు ఎల్బీ డబ్ల్యూలు అయ్యారంటే, శ్రీలంక బౌలర్లు వికెట్ ఎటాకింగ్ ఎలా చేశారో అర్థమవుతోంది. కరెక్టుగా బాల్ వికెట్లపైకి వస్తుంటే, డిఫెన్స్ కూడా చేసుకోలేకపోవడం దారుణమని నెటిజన్లు అంటున్నారు. పిచ్ బాగా లేదు. టర్న్ బాగా అవుతోంది అని కుంటి సాకులు చెప్పవద్దని సీరియస్ అవుతున్నారు.

ఈ మాత్రం దానికి ఇంటర్నేషనల్ ప్లేయర్స్, కోట్ల రూపాయలు ఫీజులు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. పిచ్ టర్న్ అయితే చాలు, వికెట్లు పారేసుకుంటే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక మొదట బ్యాటింగుకి వచ్చింది. స్టార్ ఓపెనర్ నిస్సాంక చక్కగా ఆడి 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. ఒక దశలో 26.3 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 101 పరుగులతో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 150 పరుగులైనా చేస్తుందా? అనుకున్నారు.

ఆ దశలో దునిత్ వెల్లలాగే (67 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. ఓపికగా ఒకొక్క పరుగు తీస్తూ, అలా స్కోరు బోర్డుని కదిలించాడు. హసరంగ (24), అకిల ధనంజయ (17), కెప్టెన్ చరిత్ అసలంక (14), కుశాల్ మెండిస్ (14), జనిత్ (20) ఇలా అందరూ కలిసి తలో చేయి వేసి.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేశారు.

Also Read: బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ హిస్టరీ క్రియేట్, మరో పతకం ఖాయం..

ఇండియా బౌలింగులో సిరాజ్ 1, అర్షదీప్ 2, అక్షర్ పటేల్ 2, శివమ్ దుబె 1, కులదీప్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ఒక ఓవర్ వేసి 14 పరుగులిచ్చాడు. అది కూడా మ్యాచ్ టర్నింగ్ కావడానికి కారణమని అంటున్నారు. సిరాజ్, అర్షదీప్ 8 ఓవర్లు, శివమ్ దుబె 4 ఓవర్లు వేశాడు. వీరందరినీ వదిలేసి గిల్ కి బౌలింగ్ ఇవ్వడం.. కెప్టెన్ రోహిత్ శర్మ తప్పిదమని అంటున్నారు.

అనంతరం 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా చాలా సాధికారికంగా ఆడింది. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ గిల్ (16) నిరాశపరిచాడు. అయినా సరే 12.4 ఓవర్లలో 75 పరుగులతో టీమ్ ఇండియా బ్రహ్మాండమైన స్థితిలో నిలిచింది.

ఆ సమయంలో గిల్ అతిగా డిఫెన్స్ ఆడి, చివరకు అనవసర షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు. అప్పుడు విరాట్ (24), శ్రేయాస్ అయ్యర్ (23) జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ని పట్టాలెక్కించారు. ఈ దశలో ఇద్దరూ వెంటవెంటనే అయిపోయారు. ఈ మధ్యలో ప్రమోషన్ మీద వచ్చిన వాషింగ్టన్ సుందర్ (5) వెంటనే అయిపోయాడు. మళ్లీ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కాంబినేషన్ కాసేపు మ్యాచ్ ని నిలబెట్టింది.

Also Read: ఉత్కంఠగా సాగిన తొలి వన్డే.. భారత్‌- శ్రీలంక మ్యాచ్‌ టై

అక్షర్ పటేల్ (33) మళ్లీ అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ (31) ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అయిపోయారు. అప్పుడు శివమ్ దుబె వచ్చి, మ్యాచ్ లో టెన్షన్ తగ్గించాడు. స్కోరుని 230 పరుగులకి తీసుకొచ్చాడు. ఒంటిచేత్తో గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. ఈ రోజు మ్యాచ్ లో సూపర్ హీరో తనే అని అనుకున్నారు. ఆ ఒక్క పరుగు వద్ద ఎల్బీగా వెనుతిరిగాడు.

ఇంక ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అర్షదీప్ వచ్చి సింగిల్ తీస్తే గెలిచే మ్యాచ్ కి అనవసర షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు. దీంతో మ్యాచ్ టై అయిపోయింది. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు, ఈ ఓటమికి కారణం అర్షదీప్ ఒక్కడిదే కాదు. మొదటి నుంచి వికెట్లు పారేసుకుంటూ ఆడిన టీమ్ అందరిదీ అని చెప్పాలి.

శ్రీలంక బౌలింగులో హసరంగ 3, చరిత్ అసలంక 3, దునిత్ 2, అసిత ఫెర్నాండో 1, అకిల్ ధనంజయ 1 వికెట్ పడగొట్టారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×