Jaiswal Traps Dickwella: శ్రీలంక వర్సెస్ టీమిండియా ( Sri Lanka vs India) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ ( India tour of Sri Lanka 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. విజయం ముంగిట టీమిండియా ఉండగా డ్రా చేసేందుకు శ్రీలంక ప్లేయర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన నిరోషన్ డిక్వెల్లాను పది పరుగుల వద్దే ఔట్ అయ్యాలే యశస్వి జైస్వాల్ స్కెచ్ వేశాడు. ఐపీఎల్ ఆశ చూపి.. అతడిని పెవిలియన్ కు పంపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ నేపథ్యంలో టీమిండియా విజయం ముంగిట ఉంది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాను ట్రాప్ చేసి పెవిలియన్ కు పంపాడు యశస్వి జైష్వాల్. నిరోషన్ డిక్వెల్లా బ్యాటింగ్ మొదలు పెట్టగానే.. అతడిని స్లెడ్జింగ్ చేయడం షురూ చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడవు కదా…? ఇప్పుడు కూడా నీ ఆటను చూపించు అని రెచ్చగొట్టాడు.
దానికి పొంగిపోయిన నిరోషన్ డిక్వెల్లా.. నేను అద్భుతంగా ఆడానా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. డీప్ స్క్వేర్ లెగ్ లో అద్భుతంగా షాట్స్ బాగా ఆడతావని టెంప్ట్ చేశాడు. నువ్వు బాగా ఆడితే, ఐపీఎల్ లోకి కూడా తీసుకుంటామని ఆఫర్ ఇచ్చాడు. దీంతో పొంగిపోయిన నిరోషన్ డిక్వెల్లా… భారీ షాట్ కు వెళ్లి ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత లంక వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గాలే వేదికగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్ట్ లో అన్ని వివాదాలే చోటు చేసుకున్నాయి. ఈ టెస్ట్ ప్రారంభమైన సందర్భంగా మహమ్మద్ సిరాజ్ మొదట రెచ్చిపోయాడు. శ్రీలంక బ్యాటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నోటికి వచ్చిన బూతులను తిట్టాడు. ఇదే శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ ను మొదటి ఇన్నింగ్స్ సందర్భంగా రెచ్చగొట్టి… అవుట్ అయ్యేలా మహమ్మద్ సిరాజు ప్లాన్ చేశాడు. ఇక ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా అదే ప్రయత్నం చేసి సఫలమయ్యాడు. అలాగే, ఇదే మ్యాచ్ లో లాహిరు క్యాచ్ కూడా వివాదంగా మారింది. ఫ్రంట్ లో ఫీల్డింగ్ చేసిన జురెల్… లాహిరు క్యాచ్ పట్టుకున్నాడు. అయితే బంతి నేలకు తగిలిందని శ్రీలంక అభిమానులు ఆరోపణలు చేస్తుండగా… అంపైర్లు మాత్రం అది సరైన క్యాచ్ అని, అవుట్ ఇచ్చేశారు.
Jaiswal: “Come on, we need to see some sixes from you!”
Dickwella: “If you take me to the IPL…”
Jaiswal: “Hit some sixes, then I will.”
Next ball: Dickwella OUT!
Jaiswal played mind game very well. pic.twitter.com/XSP4ltdsdb— Kavish (@kavish_tvk) August 19, 2026