Shoaib Akhtar ON Mohammad Amir: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 tournament) కోసం ఇప్పటి నుంచి 10 ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. గత సీజన్ కంటే ఈ సారి మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు… కొత్త ప్లేయర్లను బరిలోకి దించేందుకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ దేశంతో సంబంధాలు తెంచుకున్న మహమ్మద్ అమీర్ ను ( Mohammad Amir) ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2027 లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) సంచలన డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. పాకిస్తాన్ తో అతడు బంధం తెంచుకున్నాడని.. బ్రిటిష్ పౌరసత్వం దక్కించుకున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో విదేశీ ఆటగాడి కింద మహమ్మద్ అమీర్ కు అవకాశం ఐపిఎల్ టోర్నమెంటులో ఇవ్వాలని బీసీసీఐని కోరారు.
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir) ప్రతిభవంతుడని వెల్లడించారు షోయబ్ అక్తర్. తన కంటే గొప్ప ఆటగాడని కితాబు ఇచ్చారు. కానీ అతడు తీసుకున్న నిర్ణయాలు మాత్రం తనను నిరాశపరిచాయని వెల్లడించారు. తనకంటే మెరుగైన బౌలర్లు రావాలని తాను ఎప్పుడూ కోరుకునే వాడినని… అమీర్ వచ్చినప్పుడు తాను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే అమీర్ తన కెరీర్ లో అనేక ఆరోపణలు ఎదుర్కొని… మంచి లైఫ్ నాశనం చేసుకున్నాడని మండిపడ్డారు.
ఇక తన భార్యతో పాటు బ్రిటిష్ వెళ్ళిపోయిన మహమ్మద్ అమీర్, ఛాన్స్ ఉంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఆడాలని రిక్వెస్ట్ చేశారు. లేకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి ఆయన అతడిని తీసుకోవాలని కోరారు. బ్రిటిష్ పౌరసత్వం వచ్చిన నేపథ్యంలో అతనికి బిసిసిఐ అవకాశం ఇవ్వాలని కోరారు. తనకంటే గొప్ప బౌలర్ అయిన నేపథ్యంలో మహమ్మద్ అమీర్ కు రూ. 20 కోట్లు ఇచ్చిన తప్పు లేదన్నారు.
మహమ్మద్ అమీర్ ( Mohammad Amir) , మహమ్మద్ అసిఫ్ లు ఇద్దరు కూడా ప్రతిభవంతులైన బౌలర్లని మెచ్చుకున్న షోయబ్ అక్తర్, స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఈ ఇద్దరు తమ కెరీర్ నాశనం చేసుకున్నారని ఆగ్రహించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ తో కూడా మహమ్మద్ అమీర్ గొడవ పెట్టుకున్నాడని మండిపడ్డారు. వాళ్ల పైన కోపంతో రిటైర్మెంట్ ప్రకటించి పెద్ద తప్పిదం చేశాడని సీరియస్ అయ్యారు. ఇప్పటికైనా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లేదా ఐపిఎల్ లోకి (IPL) వచ్చి తన సత్తా చాటాలని మహమ్మద్ అమీర్ ను కోరారు షోయబ్ అక్తర్ (Shoaib Akhtar).