E-Paper
Advertisement

Smriti Mandhana : నాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. స్మృతి మంథాన వీడియో వైరల్..

Smriti Mandhana : నాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. స్మృతి మంథాన వీడియో వైరల్..

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న స్మృతి మంథాన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బిగ్ బీతో పంచుకున్నారు. అంటే తను ఇటీవల కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంకి వెళ్లింది. తనతో పాటు సౌతాఫ్రికా నుంచి రెస్ట్ కావాలంటూ చెప్పి వచ్చేసిన ఇషాన్ కిషన్ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు.

ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక యువకుడు స్మృతి ని ఉద్దేశించి ఒక ప్రశ్న వేశాడు. మీకు కాబోయే భర్త విషయంలో ఏ క్వాలిటీలు ఉండాలని కోరుకుంటున్నారని అడిగాడు. దానికి స్మృతి ముసి ముసి నవ్వులు కురిపించింది. పక్కనే ఉన్న ఇషాన్ కిషన్ బ్రహ్మాండమైన ప్రశ్న అంటూ మెచ్చుకున్నాడు. దీనికి అమితాబ్ కూడా షాక్ తిన్నట్టు నటించి, ఆ ప్రశ్న అడిగిన అబ్బాయిని నీకు పెళ్లయ్యిందా? అని అడిగాడు.

తను లేదు అని సమాధానం చెప్పగానే.. ఒహో.. అదన్నమాట సంగతి అని అనేసరికి వచ్చినవాళ్లందరూ నవ్వులు కురిపించారు. స్మృతి మాత్రం అంత ఇంటర్నేషనల్ ప్లేయర్ అయి ఉండి కూడా సాంప్రదాయ ఆడపిల్లలాగే సిగ్గు పడింది. అమితాబ్ కూడా ఆ సమాధానం చెబితే, అందరూ ఆనందిస్తారనేసరికి, తను చెప్పడం ప్రారంభించింది.

ముఖ్యంగా క్రికెట్ ని అభిమానించేవాడై ఉండాలి. నిజానికి నాకు ఖాళీ ఉండదు. మ్యాచ్ లు లేకపోతే ప్రాక్టీసులో గడుపుతాను. ఇక టూర్లుకి వెళితే ఎక్కువ రోజుల సమయం పడుతుంది. దీంతో నేనెక్కువ సమయం ఇంటిలో గడపలేను. ఇలాంటి విషయాల్లో తను సర్దుకుపోవాలి. అలాగే నాకింకా కెరీర్ ఉంది. అందువల్ల ఇంటి బాధ్యతలవీ తనే చూసుకునేవాడై ఉండాలి. ఎప్పుడూ కేరింగ్ తో ఉండాలని తెలిపింది.

ఈ ప్రోగ్రామ్‌లో స్మ‌ృతి చెప్పిన కబుర్లు వైరల్‌గా మారాయి. అలాగే తాను క్రికెటర్‌గా కావడానికి గల కారణాలు వివరించింది. తన అన్నయ్యతో కలిసి క్రికెట్ కి వెళ్లేదాన్ని, అతని ఆటను పక్క నుంచే చూసేదాన్ని…అలా క్రికెట్ నేర్చుకున్నానని తెలిపింది. మా అన్నయ్య లెఫ్ట్ హ్యాండర్. అందుకే నేనూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా మారిపోయానని నవ్వుతూ తెలిపింది.

మా నాన్న, సోదరుడు ఇద్దరూ క్రికెటర్లే. కానీ నాన్నకు బాధ్యతలు ఉండటంతో కెరీర్ గా ఎంచుకోలేకపోయాడు. అందుకే మా ఇద్దరికి క్రికెట్ నేర్పించాడని తెలిపింది. ఒకరినైనా దేశం తరపున టీమిండియాలో చూడాలనుకున్నాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను క్రికెట్ విషయాలు వింటూనే జన్మించానని తెలిపింది. మొత్తానికి ఇషాన్ కిషన్ మాత్రం స్మృతి పెళ్లి విషయంలో అడిగిన ప్రశ్నకు బాగా ఎంజాయ్ చేశాడు. తన స్పందన కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యింది.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×