BigTV English

Antonio Guterres | యుద్దానికి ఇజ్రాయెల్ తప్పులే కారణం.. ఐక్యరాజ్యసమితి చీఫ్ తీవ్ర ఆరోపణలు!

Antonio Guterres | ఇజ్రాయెల్-హమాస్ యుద్దంతో ప్రపంచ దేశాలన్నీ టెన్షన్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 21000 మంది గాజా వాసులు చనిపోయారని సమాచారం. ఐక్యరాజ్యసమితిలో దాదాపు ప్రతీ రోజు దీనిపై చర్చ జరుగుతోంది.

Antonio Guterres | యుద్దానికి ఇజ్రాయెల్ తప్పులే కారణం.. ఐక్యరాజ్యసమితి చీఫ్ తీవ్ర ఆరోపణలు!

Antonio Guterres | ఇజ్రాయెల్-హమాస్ యుద్దంతో ప్రపంచ దేశాలన్నీ టెన్షన్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 21000 మంది గాజా వాసులు చనిపోయారని సమాచారం. ఐక్యరాజ్యసమితిలో దాదాపు ప్రతీ రోజు దీనిపై చర్చ జరుగుతోంది.


ప్రపంచ దేశాలలో అత్యధికం ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుతుంటే ఇజ్రాయెల్ మాత్రం అక్టోబర్ 7న హమాస్ దాడులను కారణంగా చూపుతూ దాదాపు 90 శాతం గాజాను ఆక్రమించుకుంటూ పోతోంది. అమాయక పౌరులను నిర్దాక్షిణ్యంగా బాంబు దాడులతో హత్య చేస్తోంది. అయితే ఈ యుద్దంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలబడడంతో పెద్ద సమస్యగా మారింది. పాశ్చాత్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తొలుత ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడినా.. భారీ స్థాయిలో పాలస్తీనా వాసుల రక్తపాతం చూసి వెనుకడుగు వేశాయి.

దీనిపై తాజాగా బుధవారం ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గెటెరస్ స్పందించారు. కారణం లేకుండా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయలేదని.. గత 56 ఏళ్లుగా అంతర్జాతీయ చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ.. పేద పాలస్తీనా వాసుల భూములను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడమే ఈ యుద్ధానికి అసలు కారణమని ఆయన తీవ్ర స్వరంతో చెప్పారు.


”56 ఏళ్లుగా పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దారుణాలు చేస్తోంది. పాలస్తీనా వాసులకు స్కూళ్లు, ఆస్పత్రులు లేవు. వారికి ఆర్థిక వ్యవస్థ లేదు. పాలస్తీనా యువతకు ఉద్యోగాలు లేవు. వారి ఇళ్ల నుంచి వారిని ఇజ్రాయెల్ బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. ఇజ్రాయెల్ సైనికులు వారితో హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వారి భూములను ఆక్రమించుకొని ఇజ్రాయెల్ వాసులు నివాసాలు ఏర్పర్చుకుంటున్నారు. ఎన్నిసార్లు ఐక్యరాజ్యసమితి ఈ అంశంపై హెచ్చరించినా.. ఇజ్రాయెల్ ధోరణి మారలేదు. ఇప్పుడు యుద్ధంతో అమాయక పౌరులకోసం ఐక్యరాజ్యసమితి అందించే మానవత్వ సహాయం కూడా అందకుండా చేస్తోంది,” అని ఆంటోనియో అన్నారు.

ఆంటోనియో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఏకంగా ఐక్యరాజ్యసమితి అధికారులకే వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ” గాజాలోని ఎవరినీ అనుమతించేది లేదు. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎవరు నిలబడినా.. ఉపేక్షించేది లేదు.. అది ఎవరైనా(ఐక్యరాజ్యసమితి) సరే,” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యఆవ్ గాలెంట్ అన్నారు.

Antonio Guterres, Yoav Gallant, slam, Israel, responsible, ongoing war, Israel Settlement, United Nations, Palestine,

Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×