BigTV English

Smriti Mandhana: రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ షాక్‌ ఇచ్చిన మందాన

Smriti Mandhana: రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ షాక్‌ ఇచ్చిన మందాన

Smriti Mandhana Composer Palaash Muchhal Recently Celebrated Five Years: టీమిండియా మహిళల జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు ఆటతోనూ, ఇటు తన గ్లామర్‌తోనూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా ఆమెకు సంబంధించిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఆమె పోస్ట్‌తో యువ హృదయాలు ముక్కలయ్యాయి. ఎందుకంటే మ్యూజిక్ కంపోజర్‌ పలాశ్‌ ముచ్చల్‌తో ఉన్న ఆమె రిలేషన్‌షిప్‌ గురించి రివీల్ చేయడమే దానికి మెయిన్ రీజన్.తమ ఐదేళ్ల రిలేషన్‌షిప్‌కు గుర్తుగా స్మృతితో కలిసి కేక్‌ కట్‌ చేస్తోన్న ఫొటోలను అతడు షేర్ చేశాడు.ఆ పోస్టుకు ఈ బ్యాటర్‌ కూడా రియాక్ట్ అయ్యారు.ఇక ఆ ఫొటోలను చూడగానే నెటిజన్లు క్యూట్‌ అంటూ రకరకాల కామెంట్ల వర్షం కురిపించారు.


వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కొద్దికాలంగా రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ రూమర్స్‌కి చెక్‌ పెడుతూ తమ ఐదేళ్ల బంధాన్ని రివీల్ చేసింది. తన బాయ్‌ప్రెండ్ 29 ఏళ్ల పలాశ్ ఒక మ్యూజిక్ కంపోజర్‌. మనోడు టీ సిరీస్‌,జీ మ్యూజిక్,పాల్‌ మ్యూజిక్‌ కోసం పలు మ్యూజిక్ ఆల్భమ్‌లు చేశాడు.అలాగే వెబ్‌సిరీస్‌,అర్ధ్‌ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.అలాగే ఆశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో వచ్చిన ఖేలే హమ్‌ జీ జాన్‌ సేలో అభిషేక్ బచ్చన్‌,దీపికా పదుకొణెతో కలిసి యాక్ట్ చేశాడు.అతడి సోదరి పలక్ ముచ్చల్‌ కూడా బాలీవుడ్‌లో సింగర్‌గా రాణిస్తున్నారు.గతంలో స్మృతి పియానో వాయిస్తోన్న వీడియోను షేర్‌ చేసి న్యూ స్టూడెంట్‌ అంటూ పలాశ్‌ రాసుకొచ్చాడు.

Also Read: సెంచరీ బ్యాట్ నాది కాదు: అభిషేక్


తన బ్యాటింగ్‌ మాయాజాలంతో గత దశాబ్దకాలంగా భారత మహిళా జట్టు విజయాల్లో కీ రోల్‌ పోషిస్తోన్న స్మృతి ఓ సందర్భంలో కాబోయేవాడి గురించి మాట్లాడుతూ..పెళ్లనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఓ మెయిన్‌ ఘట్టం. కాబోయేవాడు ఎలా ఉండాలో ప్రతీ అమ్మాయీ కల.అలా నాకూ కొన్ని కలలున్నాయి. అన్నింటికంటే మెయిన్‌గా నన్ను చేసుకోబోయేవాడు మంచి మనసున్నవాడై ఉండాలి. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. కెరీర్‌ బిజీ అయిపోయి కొన్నిసార్లు నేను తనకు సమయం కేటాయించలేకపోవచ్చు.ఈ క్రమంలో నన్ను అర్థం చేసుకొని ప్రోత్సహించేవాడినే మనువాడతానంటూ తన మనసులోని మాటను రివీల్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆమె అభిమానులు సైతం ఆమె చేసిన వ్యాఖ్యలతో ఖంగుతిన్నారు. అనంతరం వీరిద్దరికి విషెస్ తెలుపుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Tags

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×