BigTV English

Abhishek Sharma: సెంచరీ బ్యాట్ నాది కాదు: అభిషేక్

Abhishek Sharma: సెంచరీ బ్యాట్ నాది కాదు: అభిషేక్

Abhishek Sharma Comments After Scoring Maiden Century: జింబాబ్వే తో జరుగుతున్న టీ 20 సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ లో అభిషేక్ శర్మ సెంచరీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ ఒక కొత్త విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విషయం ఏమిటంటే ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో టీ 20 సిరీస్ కి కెప్టెన్ గా ఉన్న గిల్ తను కలిసి 12వ ఏట నుంచి కలిసి క్రికెట్ ఆడుతున్నామని అన్నాడు.


నేనెప్పుడు మ్యాచ్ లో టెన్షన్ అనిపించినా గిల్ బ్యాట్ తీసుకువెళ్లి ఆడుతుంటానని అన్నాడు. జింబాబ్వే సిరీస్ లో తొలి మ్యాచ్ డక్ అవుట్ అయిన తర్వాత, రెండో మ్యాచ్ కొంచెం టెన్షన్ అనిపించింది. అప్పుడు అన్యాపదేశంగా చిన్ననాటి సెంటిమెంటు గుర్తుకొచ్చింది. వెంటనే గిల్ ని బ్యాట్ అడిగాను. వెంటనే తను ఇచ్చాడు. ఇప్పుడా బ్యాట్ తోనే ధనాధన్ ఆడినట్టు సంతోషంగా తెలిపాడు.

గిల్ బ్యాట్ తో ఆడటం చిన్నతనం నుంచి నాకు ఒక సెంటిమెంటుగా మారిపోయిందని అన్నాడు. ఐపీఎల్ లో కూడా తన బ్యాట్ తీసుకుని ఆడినట్టు తెలిపాడు. నేను క్రికెట్ లో రాణించడానికి కారణం యువరాజ్ సింగ్ అని తెలిపాడు. తను నేర్పించిన టెక్నిక్స్ నాకిప్పుడు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నాడు. సాధారణంగా కోచ్ లు లాఫ్టెడ్ షాట్లు ఆడేందుకు ఇష్టపడరు.


కానీ చిన్నతనంలో మానాన్న కోచ్ గా ఉండేవారు. నేను అలా కొడతానంటే సరే అనేవారు. కానీ ఒక కండీషన్ పెట్టేవారు. నువ్వు ఆ షాట్ కొడితే బాల్ గ్రౌండ్ అవతల ఉండాలి. లేదంటే అది ఫీల్డర్ చేతిలో ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరించి మరీ నేర్పించారని అన్నాడు. పవర్ ప్లేలో అది బాగా వర్కవుట్ అయిందని అన్నాడు.

Also Read: అభి‘షేక్’ .. తొలి భారత క్రికెటర్ గా చరిత్ర

మరోవైపు నెట్టింట టాక్ ఏమిటంటే, జింబాబ్వే ఫీల్డర్లు చాలా మంచి క్యాచ్ లను వదిలేశారు. లేదంటే మనవాళ్లు ఇంత స్కోరు చేసేవారు కాదని అంటున్నారు. రుతురాజ్ ఫస్ట్ బాల్ క్యాట్ అండ్ బౌల్డ్ అయ్యేదని, అలాగే అభిషేక్ క్యాచ్ లను వదిలేసిన సంగతి గుర్తు చేస్తున్నారు.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×