BigTV English

Karnataka Health Minister: స్విమ్మింగ్ వీడియోపై బీజేపీ విమర్శలు.. తిప్పికొట్టిన మంత్రి

Karnataka Health Minister: స్విమ్మింగ్ వీడియోపై బీజేపీ విమర్శలు.. తిప్పికొట్టిన మంత్రి

Karnataka Health Minister: కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు రావు స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరిన వీడియోపై బీజేపీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా ప్రబలుతుంటే మంత్రి సేద తీరుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో నగరాలు నీటి కుంటలు, అపరిశుభ్రతతో నిండిపోయి వ్యాధులు విజృంభిస్తుంటే పేదలకు అనుకూలమైన కాంగ్రెస్ స్వచ్ఛమైన స్విమ్మింగ్ పూల్‌లో తేలియాడుతోందని బీజేపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.


మంత్రి స్విమ్మింగ్ వీడియోను బీజేపీ ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. నీటిలో నీరో రావు కాప్షన్ జత చేసింది. రాజ్యం తగలబడుతుంటే సంగీతం వాయించిన రోమన్ రాజు నీరోతో పోల్చుతూ బీజేపీ వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. అయితే బీజేపీ చేసిన విమర్శలపై అంతే స్థాయిలో కాంగ్రెస్ మంత్రి దినేష్ గుండు రావు కూడా కౌంటర్ ఇచ్చారు. స్విమ్మింగ్, వ్యాయామం నా ఫిట్ నెస్ దిన చర్యలో భాగం. బీజేపీ నేతలు కూడా దీనిని అనుసరించాలి అని అన్నారు. ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం బాగుపడటంతో పాటు మెదడు కూడా షార్ప్‌గా పని చేస్తుంది అని తెలిపారు. అబద్దాలు, దృష్టి మళ్లించే ఆలోచనలు రాకుండా ఉంటాయి. అని చురకలు అంటించారు.

అదే విధంగా మంగళూరులో పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసుల పరిస్థితిని సమీక్ష చేయడానికి వెళ్లినట్లు  తెలిపారు. ఇంటింటికి తిరిగి నీటి నిల్వలు పరిశీలించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మంత్రి కౌంటర్‌పై బీజేపీ కూడా మరోసారి విమర్శలు చేసింది. వ్యాయామం చేయటం ముఖ్యమే కానీ ప్రజారోగ్యం సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా అంటు వ్యాధులు పెరగకుండా పని చేయటం అంత కంటే ఎక్కువ ముఖ్యం అని తెలిపింది. అది కాంగ్రెస్‌కు అస్సలు అర్థం కాదు. వచ్చే ఎన్నికల కోసం డబ్బులు దండుకోవడంలో మీరు బీజీగా ఉన్నారంటూ బీజేపీ విమర్శలు చేసింది. ఆరు నెలలుగా కర్ణాటకలో 7,006 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.


విషజ్వరాలు:
కర్ణాటకలో విషజ్వరాలు పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లోనే రాష్ట్రంలో 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ సోకి ఆరుగురు మరణించారు. మలేరియా, వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. జ్వరాలకు ప్రధాన కారణం నీటి కుంటలు, నీటి నిల్వలు అన్న సంగతి తెలిసిందే. డెంగ్యూ మలేరియాపై రివ్యూ చేయడానికి ఆరోగ్యశాఖ మంత్రి మంగళూరు వచ్చారు. ఆ సమయంలోనే మంగళూరులో మంత్రి ఈత కొడుతూ ఉండగా తీసిన వీడియోను చూసిన బీజేపీ నేతలు మంత్రిపై విరుచుకుపడ్డారు.

Also Read: హేమంత్ సోరెన్‌కు బెయిల్.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన ఈడీ

నీరు రావు:
నగరాలు, పట్టణాల్లో నీటిపారుదల అపరిశుభ్రంగా ఉన్నాయి. జ్వరాలు వస్తున్నాయి.. ఆరోగ్యమంత్రి మంచి నీటిలో తేలియాడుతున్నారని బీజేపీ విమర్శలు చేసింది. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ఈ ఆరోగ్య మంత్రి పరిస్థితి ఉందంటూ ఆరోపించంగా దీనిపై మంత్రి ఘాటుగా స్పందించారు. అంతే కాకుండా స్విమ్మింగ్ ఫిట్ నెస్ లో భాగం అని తెలిపారు.

 

 

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×