Sophie Shine On Rohit Sharma: రెండో పెళ్లి చేసుకున్న టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) – సోఫీ షైన్ (Sophie Shine) కాపురంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చిచ్చు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు అవుతున్నాయి. మొబైల్ లోనే కాకుండా, వాల్ పేపర్ పైన రోహిత్ శర్మ ఫోటోలు బయటపడిన నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే శిఖర్ ధావన్ భార్య సోఫీ షైన్ మొబైల్ ఫోన్ లో రోహిత్ శర్మ ఫోటోలు దొరికాయని అనుకుంటే తప్పులు కాలు వేసినట్టే. శిఖర్ ధావన్ మొబైల్ వాల్ పేపర్ గా రోహిత్ శర్మ ఫోటో ఉంది. ధావన్, రోహిత్ ఇద్దరూ ఓపెనర్లుగా దిగిన ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. అలాగే ధావన్ మొబైల్ నిండా రోహిత్ శర్మ ఫోటోలే ఉన్నాయి. ఈ విషయం పైన తన భర్త శిఖర్ ధావన్ ను సోఫీ షైన్ నిలదీసింది. దీనికి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ పచ్చని కాపురంలో రోహిత్ శర్మ ( Rohit sharma) నిప్పులు పోసాడని దారుణంగా సెటైర్లు పేల్చుతున్నారు.
టీమిండియా మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ తన భార్య సోఫీ షైన్ తో (Sophie Shine) కలిసి రోహిత్ శర్మ హోస్ట్ గా చేస్తున్న షోకు వెళ్లారు. ఈ సందర్భంగా ఈ షో బయట ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నన్ను ఎంత లవ్ చేస్తున్నావు అంటూ శిఖర్ ధావన్ ను సోఫీ షైన్ ప్రశ్నిస్తుంది. అయితే నీ కోసం తాజ్ మహల్ కట్టేంత ప్రేమ తనకు ఉందని ధావన్ బదులిస్తాడు. దీనికి వెంటనే సోఫీ షైన్ కౌంటర్ ఇస్తుంది. నీ మొబైల్ నిండా రోహిత్ శర్మ ఫోటోలే పెట్టుకున్నావు… వాల్ పేపర్ పైన కూడా రోహిత్ శర్మతో దిగిన ఫోటోలు మాత్రమే పెట్టావు… ఇంకెక్కడ నా మీద నీకు ప్రేమ ఉంది అంటూ అదిరిపోయే డైలాగ్ వేస్తుంది. నీకు రోహిత్ శర్మ ఎక్కువనా? నేనా అని నిలదీస్తుంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు శిఖర్ ధావన్ అలాగే సోఫీ షైన్ కాపురంలో రోహిత్ శర్మ చిచ్చు పెట్టాడని పోస్టులు పెడుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు శిఖర్ ధావన్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇద్దరు టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించారు. ఎన్నో రికార్డులు కొల్లగొట్టారు. అయితే ఎప్పుడైతే గిల్ టీమిండియాలోకి వచ్చాడో… శిఖర్ ధావన్ కు అవకాశాలు ఇవ్వడం తగ్గించింది బీసీసీఐ. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కూ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ఇచ్చాడు.