Intinti Ramayanam Today Episode September 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి వాళ్ళ డాడ్ చెప్పినట్లే భరత్ ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే రాత్రి శ్రీకర్ ఫ్రెండ్ ని రమ్మని చెప్తుంది. అతను రాగానే మా శ్రీకర్ బావ చాలా మంచివాడు ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది.. శ్రీయా రావడం చూసి పల్లవి ఇంకా రెచ్చిపోతుంది. శ్రీకర్ బావ లేకుంటే శ్రీయ ఎలా ఉంటుంది అసలే అది అమాయకురాలు అని కావాలనే పల్లవి శ్రీయాని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అది విన్న శ్రీయా ఇంట్లోకి వెళ్లి శ్రీకర్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది. నువ్వు పెద్ద లాయర్ అయినా కూడా ఎం చెయ్యలేదు. నిన్ను నువ్వు కాపాడుకోలేదు. ఇక మీదట మీ వదిన కోసం నువ్వు ఏది చేయొద్దు. లేకుంటే మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీయా బ్యాగ్ సర్దుకొని అక్కడికి వస్తుంది.. ఏమైందమ్మా ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావని అందరూ అడుగుతారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రేంజ్ లో క్లాస్ పీకుతుంది.. పార్వతిని దారుణంగా అవమానిస్తుంది. నా భర్త రేపు చచ్చిపోయిన సరే మీరు ఇలానే మాట్లాడతారు నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. మీలాగా నేను భర్తను వదిలేసి ఒంటరిగా ఉండలేను. నాకు నా భర్త కావాలి. మీరు ఇంకొకసారి జైలుకు వెళ్లడం అని నాకు హామీ ఇవ్వండి అని శ్రియ అడుగుతుంది.
మాట అనగానే పల్లవి ఒక్కసారిగా అరుస్తుంది.. శ్రియ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని అంటుంది.. అంత పెద్ద వయసున్న అత్తయ్య గారితో నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా అత్తయ్య గారు ఎంత బాధ పడతారు. ఊరుకుంటున్న కదా అని రెచ్చిపోతున్నావే అని పల్లవి చెంప పగలగొడుతుంది. ముందు అత్తయ్యకి క్షమాపణ చెప్పు అని పల్లవి అంటుంది.. పల్లవి అర్జెంటుగా నువ్వు అత్తయ్యకి క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఇంట్లో కూడా ఉండలేవు అని అంటుంది.. అవి మాట ప్రకారమే శ్రేయ పార్వతికి క్షమాపణ చెప్తుంది.
తనని నానా మాటలు అనడంతో పార్వతి కన్నీళ్లు పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది.. ఇక పల్లవి శ్రీకర్ దగ్గరికి వెళ్లి నీకు మీ అవని వదిన కన్నా నీ తాళి కట్టిన భార్య నీకు ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకో బావ అని అంటుంది. శ్రీయా దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండొచ్చు అని అంటాడు. ఇక అవని అక్షయ్ ఇద్దరు కూడా ఐస్ క్రీం కోసమని బయటికి వెళ్లి సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు… ఏంటి నీతో రావడం నాకు ఇష్టం లేకపోయినా సరే నా కూతురు అడిగిందని నీతో వసన్నాను అని అక్షయ్ అంటాడు..
ఇక ఇద్దరు కలిసి పోటాపోటీగా ఐస్ క్రీములను కొని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి రాగానే అక్షయ్ అవనీని నా కూతురు మీద ప్రేమతోనే నీతో వచ్చాను నీతో రావడం నాకు అస్సలు ఇష్టమే లేదు అని మరోసారి అంటాడు.. దాంతో ఫీల్ అయిన అవని అక్షయకి చెప్పకుండా ఎటో వెళ్లిపోతుంది.. అయితే అక్షయ్ అవనీ కోసం వెతుకుతాడు.. టెన్షన్ పడతాడు.. అవని ఇంటికి దూరంగా కనిపించడంతో ఊపిరి పీల్చుకుంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చావ్ ఏంటి నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెంప పగలగొడతాడు.
Also Read : దారుణంగా అవమానించిన సంజయ్.. మనోజ్ కు మైండ్ బ్లాక్..కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక..
నా మీద ప్రేమ ఉంది కానీ కోపం అనే ముసుగుతో మీరు దాన్ని దాచేస్తున్నారు అని అవని మనసులో అనుకుంటుంది. ఉదయం లేవగానే అక్షయ్ ఆఫీస్ కి వెళ్లాలని హడావిడిగా రెడీ అవుతాడు. అర్జెంటుగా ఫైలు తీసుకురమ్మని వాళ్ళ బాస్ ఫోన్ చేస్తుంది అయితే ఆటోలనీ క్యాబ్ లని ఎంతగా బుక్ చేసినా సరే రాము అని అంటారు.. ఇక రాజేంద్రప్రసాద్ అక్షయ దగ్గరకు వచ్చి నువ్వు అడగడానికి మొహమాటపడుతున్నావేమో అవనీతో వెళ్లొచ్చు కదా అని అంటాడు.. టైం అవుతుందని అక్షయ్ అవని దగ్గరికి వెళ్లి బ్రతిమలాడుతాడు. ఇద్దరూ కలిసి వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..