JP Duminy Divorce: ఇంటర్నేషనల్ క్రికెటర్లు… ఈ మధ్యకాలంలో వరుసగా విడాకులు తీసుకోవడం చూస్తున్నాం. అయితే తాజాగా సౌత్ ఆఫ్రికా ( South Africa ) మాజీ ప్లేయర్ జెపి డుమిని కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యకు విడాకులు ఇస్తూ కీలక ప్రకటన చేశాడు సౌత్ ఆఫ్రికా ఆటగాడు జేపీ డుమిని ( JP Duminy ). ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశాడు. ఈమధ్య… హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత యుజేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ, విడాకులు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట.
Also Read: Lisa Sthalekar: తల్లిదండ్రులు వద్దనుకున్నారు… అనాధాశ్రమం నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ గా లీసా ప్రయాణం
అయితే వాళ్ల ఎపిసోడ్ మరవక ముందే… టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఈ వార్తలు మరవక ముందే… సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ జెపి డుమిని ( JP Duminy Divorce ) కూడా… విడాకుల వైపు అడుగులు వేశాడు. తన భార్య స్యు ( Sue Duminy ) నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు జేపీ డుమిని.
దాదాపు 13 సంవత్సరాల పాటు jp డుమిని అలాగే ష్యూ డుమినీ ఇద్దరూ కలిసికట్టుగా… కాపురం చేశారు. ఇక జేపీ డుమిని దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా కుమార్తెలు కావడం గమనార్హం. ఒక చిన్నారి దాదాపు పది సంవత్సరాలు ఉంటే… మరో చిన్నారి ఐదు సంవత్సరాలు అని తెలుస్తోంది. అయితే ఇద్దరు చిన్నారులు ఉన్నప్పటికీ… తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు జెపి డుమిని ప్రకటన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కానీ అన్ని ఆలోచించిన తర్వాత… 13 సంవత్సరాల తర్వాత తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు జేపీ డుమిని. తన భార్య అలాగే నేను కూర్చొని మాట్లాడుకున్నామని… అందుకే ఇప్పుడు విడిపోతున్నట్లు తెలిపాడు. ఇద్దరి ఇష్టపూర్వకంగానే విడిపోతున్నట్లు కూడా ప్రకటన చేశాడు. అయితే తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎలాంటి విషయాన్ని ఇంకా స్పష్టంగా.. చెప్పలేకపోయాడు. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు ఆడాడు జేపీ డుమిని. అలాగే 199 వన్డే మ్యాచ్లు ఆడిన జేపీ డూమిని… 81 t20 మ్యాచ్ లు ఆడాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో 83 మ్యాచ్లు ఆడి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ… క్రికెట్ కు jp డుమిని గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ… ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ కోచ్ గా కూడా పనిచేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో… తన వివాహ బంధానికి వీడ్కోలు పలకడంపై… అందరూ ఉలిక్కి పడుతున్నారు.
Also Read: Indian Flag – Gaddafi Stadium: దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్… ఇండియా జెండా ఎగరవేసిందిగా?
Former South African cricketer JP Duminy and his wife Sue Duminy have parted ways after years together…!!#deprem pic.twitter.com/6woZPVFTej
— NaWaB (@NawabSalaar_IK) February 17, 2025