BigTV English

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం.. పాకిస్థాన్ సెక్యూరిటీ చూడండి ?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం.. పాకిస్థాన్ సెక్యూరిటీ  చూడండి ?

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament  ).. కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఎల్లుండి నుంచి చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించనుంది ఐసీసీ పాలక మండలి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్ లో.. నిర్వహించనున్న ఐసీసీ పాలక మండలి ( ICC Governing Council )… మొదటి మ్యాచ్ కు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మొదటి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభమవుతుంది. అంటే ఒకటిన్నర గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ జరుగుతుంది.


Also Read: Nita Ambani: డబ్బులు లేక కడుపు మాడ్చు కునేవారు.. పాండ్యా బ్రదర్స్ పై నీతా సంచలనం?

చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ ( Pakisthan ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మధ్య మొదటి మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే మొదటి మ్యాచ్ నిర్వహించనున్న నేపథ్యంలో.. కరాచీలో ఇప్పటికే పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ రెండు జట్లు ప్రాక్టీస్.. చేస్తున్న నేపథ్యంలో…. కరాచీ నేషనల్ స్టేడియం వద్ద భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మిలిటరీ ఫోర్స్ ను ( Military force ) బరిలోకి దించింది.


 

కరాచీ స్టేడియంలో ( Karachi Stadium )  ఉన్న ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా… చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఉగ్రవాదుల సమస్యలు తెరపైకి రాకుండా… కట్టుదిట్టంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలోనే… ఓ ఫన్నీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ జట్లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా… పాకిస్తాన్ ఆర్మీ బయట కాపలాగా ఉన్నట్లు ఒక ఫోటో వైరల్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్.. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్… ఫిబ్రవరి 19వ తేదీన తలపడనున్నాయి. ఆ తర్వాత టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఈనెల 20వ తేదీన మ్యాచ్ ఉండనుంది. ముఖ్యంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ వచ్చే ఆదివారం జరగనుంది. ఈనెల 23వ తేదీన… దుబాయ్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఉండనుంది. దీంతో… టీమిండియా ఫ్యాన్స్… అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో గెలిచి టీమిండియా సత్తా చాటాలని అనుకుంటున్నారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటుకు సంబంధించిన… మ్యాచ్ లన్ని హాట్ స్టార్ లో ప్రసారం కానున్నాయి. జియో హాట్ స్టార్ గా మారిన.. హాట్ స్టార్ వేదికగానే ఈ మ్యాచ్ లన్ని జరుగుతాయి. అయితే ఈ మ్యాచ్లు చూడాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాలని చెబుతున్నారు.

Also Read: IND vs PAK Ticket price: ఫ్యాన్స్ కు షాక్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 4 లక్షలు?

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×