BigTV English

Temba Bavuma : బుడ్డోడు బుడ్డోడు అన్నారు.. ఆస్ట్రేలియా గుడ్డలు విడదీసి కొట్టాడు!

Temba Bavuma : బుడ్డోడు బుడ్డోడు అన్నారు.. ఆస్ట్రేలియా గుడ్డలు విడదీసి కొట్టాడు!

Temba Bavuma :  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్ ఇంగ్లాండ్ లోని లార్డ్స్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగింది. ఇక్కడ దక్షిణాఫ్రికా  ఆస్ట్రేలియాను 5  వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా కు 282 పరుగులు లక్ష్యం నిర్దేశించింది. దీనిని దక్షిణాఫ్రికా మార్కరమ్ సెంచరీ చేయడం.. కెప్టెన్ బవుమా హాఫ్ సెంచరీ సాయంతో నాలుగో రోజు మొదటి సెషన్ లోనే ఛేదించింది. సౌతాఫ్రికా కు ఇది 27 ఏళ్లలో మొదటి ఐసీసీ ట్రోఫీ, దక్షిణాఫ్రికా టైటిల్ గెలిచినందుకు ఐసీసీ నుంచి 30.78 కోట్లు రూపాయలు అందుకుంది. గతంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న జట్టు కంటే రెట్టింపు లభించింది. ఈ ఏడాది ఫైనల్ లో ఓడిపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టు రూ.18.46 కోట్లు గెలుచుకుంది. గతంలో రన్నరప్ గా నిలిచిన జట్టు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అనే చెప్పవచ్చు.


Also Read :  Priya saroj : రింకూ ఒక్కడే కాదు.. ఆయన కాబోయే భార్య కూడా సిక్సులతో చెలరేగుతుంది

మరోవైపు 2023లో టైటిల్ గెలిచినందుకు ఆస్ట్రేలియా జట్టుకి 13.69 కోట్లు లభించాయి. రన్నరప్ గా నిలిచిన భారత జట్టు కి రూ.6.84 కోట్లు గెలుచుకుంది. తాాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాతో పాటు పలువురు కీలక ఆటగాళ్లు సంబురాలు జరుపుకున్నారు. ముఖ్యంగా మందుతో చిందు వేస్తోంది సౌతాఫ్రికా టీమ్. ఇక కెప్టెన్ బవుమా అయితే ఏకంగా మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం.  ముఖ్యంగా కెప్టెన్ బవుమా ని బుడ్డోడు బుడ్డోడు అని కామెంట్ చేశారు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఫేజ్ లోనే ఉంది. బుడ్డొడా అని తమను హేళన చేసిన ఆసీస్ మీద కొట్టడంతో కెప్టెన్ బవుమా కి మరింత కిక్ ఇచ్చినట్టయింది. ప్రస్తుతం వీళ్ల సెలబ్రేషన్స్ వైరల్ అవుతున్నాయి.   27 ఏళ్ల తరువాత దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ గెలవడంతో అంతా సంబురాలు జరుపుకోవడం విశేషం. సౌతాఫ్రికా విజయంలో చాలా మంది హీరోలున్నారు. మొదటి పేరు మార్కరమ్ దే అని చెప్పవచ్చు. వాస్తవానికి మార్కర్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు సెంచరీ సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.  మార్కరమ్ 136 పరుగులు చేసి.. చివర్లో స్టార్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో మార్కరమ్ 14 ఫోర్లు బాదాడు.


వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు 2023 ఫైనల్ లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలు సాధించారు. అప్పుడు వారిద్దరూ జట్టు విజయంలో భాగస్వాములయ్యారు. ఐడెన్ మార్కరమ్ 207 136 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేసాడు. అతనికి తోడు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా 134 బంతుల్లో 66 పరుగులు చేసాడు. వీరిద్దరూ కలిసి 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లార్డ్స్ లో విజిటింగ్ బ్యాట్స్ మెన్ అత్యధిక నాలుగో ఇన్నింగ్స్ లో ఎక్కువ సమయం క్రీజులో ఉన్న జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. వీరిద్దరూ ఇన్నింగ్స్ లో ఎంత పాత్ర పోషించారో కగిసో రబాడా సౌతాఫ్రికా బౌలింగ్ హీరోగా అవతరించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ ను కూల్చి మ్యాచ్ లో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. అలాగే ఆస్ట్రేలియా జట్టును ఓడించి తొలి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను కైవసం చేసుకోవడం ద్వారా తమపై ఉన్న చోకర్స్ లేబుల్ తొలగించుకున్నారు. ఇక 27 సంవత్సరాల ఐసీసీ ట్రోఫీ దాహాన్ని తీర్చుకున్నారు.

?igsh=MXkxd2h4amcyYTYyag==

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×