Temba Bavuma: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 {WTC final 2025} ఫైనల్ ఇంగ్లాండ్ లోని లార్డ్స్ లో ఆస్ట్రేలియా – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా శనివారం రోజు ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ని కైవసం చేసుకుంది. 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ ని కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా.
Also Read: Yograj Singh: Ms ధోని వల్ల 7 గురి క్రికెటర్ల జీవితాలు నాశనమయ్యాయి.. యోగ్ రాజ్ హాట్ కామెంట్స్!
ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఆటగాడు మార్క్రమ్ సెంచరీ, కెప్టెన్ టెంబా బావుమా ఆఫ్ సెంచరీ సహాయంతో నాలుగవ రోజు మొదటి సెషన్ లో ఛేదించింది. ఈ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచినందుకుగాను ఐసీసీ నుండి 30.78 కోట్ల రూపాయలను అందుకుంది దక్షిణాఫ్రికా. ఈ చారిత్రక విజయం అనంతరం కెప్టెన్ బావుమా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మేస్ చేసిన సెలబ్రేషన్స్ అభిమానులను ఉర్రూతలూగించింది.
కేజిఎఫ్ సినిమాలోని రాకీ భాయ్ స్టైల్ లో బావుమా చేసిన ఈ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సౌత్ ఆఫ్రికా జట్టుకు “చోకర్స్” అనే అపాఖ్యాతి ఉండేది. ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాలలో ఒత్తిడికి గురి కావడం, ఆ కారణంగా ఓడిపోవడం ఆ జట్టుకు అలవాటు. అలాంటి జట్టు ప్రపంచ క్రికెట్ లో అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఫైనల్ లో ఓడించి.. డబ్ల్యూటీసీ టైటిల్ ని గెలుచుకోవడం ఒక అద్భుతం.
ఈ అద్భుత విజయం వెనుక కెప్టెన్ టెంబా బావుమా {Temba Bavuma} అసాధారణ పోరాటం, కృషి, పట్టుదల ఉన్నాయి. ఆస్ట్రేలియాను ఓడించి తొలి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ని కైవసం చేసుకోవడం ద్వారా చాలా కాలంగా తమపై ఉన్న “చోకర్స్” అనే లేబుల్ ని తొలగించుకున్నారు. డబ్ల్యూటీసి ట్రోఫీని వరుసగా 8 టెస్ట్ విజయాలతో గ్రాండ్ గా ముగిసింది సౌత్ ఆఫ్రికా. ఇక టైటిల్ గెలుచుకున్నప్పటినుండి సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది సౌత్ ఆఫ్రికా. అయితే తాజాగా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ డబ్ల్యూటీసి మేస్ ని వారి ముందు ఉన్న ఓ టేబుల్ పై ఉంచి.. కెప్టెన్ బావుమాని ప్రశంసిస్తూ ఓ అద్భుతమైన పాట అందుకున్నారు.
Also Read: Team India: బరితెగించిన తెగించిన టీమిండియా ప్లేయర్ భార్య… టాలీవుడ్ నిర్మాతతో ఆ పనులు !
ఇందుకు సంబంధించిన వీడియో ని తాజాగా షేర్ చేసింది ఐసీసీ. ముఖ్యంగా కగిసో రబాడ తన స్వరంతో ఆశ్చర్యపరిచాడు. ఇలా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఎంజాయ్ చేస్తూ పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అభిమానులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బవుమాను “లార్డ్ బవుమా” అని కీర్తిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ కి ఒక కొత్త అధ్యాయాన్ని లెక్కించాడు బావుమా. ఈ విజయం సౌత్ ఆఫ్రికా క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">