Indian Cricket Players: ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 కి ఆయా దేశాలు తమ జట్లను ప్రకటించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జనవరి 12వ తేదీని డెడ్ లైన్ గా నిర్ణయించింది. అంటే జనవరి 12 తేదీ నాటికి మొత్తం 8 దేశాలు తమ జట్లను ప్రకటించాలి. టీమిండియా అభిమానులు కూడా తమ జట్టు ఎంపిక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జట్టు ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్.
Also Read: Malaysia Open: పైకప్పు నుంచి నీళ్లు లీక్.. వర్షంతో బ్యాడ్మింటన్ మ్యాచ్ వాయిదా!
భారత జట్టు ఎంపికలో ప్రాంతీయ భేదాలు ఉన్నాయని స్పష్టం చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. దీంతో సెలెక్టర్లు, కోచ్, ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమిండియా జట్టు ఎంపికపై చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే టీమ్ ఇండియా సెలక్షన్ లో ప్రాంతీయ భేదాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు బద్రీనాథ్.
యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ ఎంపికపై ఆయన ఫైర్ అయ్యారు. భారత క్రికెట్ లో ఉత్తరాది బోర్డుల హవా నడుస్తుందటంలో ఎటువంటి సందేహం లేదు. జట్టులోకి మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ కి చెందిన ఆటగాళ్లనే ఎక్కువగా తీసుకుంటారనే వాదన ఎప్పటినుంచో ఉంది. నార్త్ వారికి భారత క్రికెట్ లో అన్యాయం జరుగుతుందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.
తాజాగా మరోసారి ఇటువంటి విమర్శలు చేశారు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్. యువ ఆటగాడు గిల్ తమిళనాడుకు చెందిన ఆటగాడు అయితే అతడిని ఎప్పుడో జట్టులో నుంచి తీసేసేవారని అన్నారు. భారత జట్టుకు ఆడుతున్నాడు అంటే ఎన్నో అంచనాలు ఉంటాయని.. కానీ అతడు వాటిని అందుకోవడం లేదన్నారు. ఒక బ్యాటర్ గా పరుగులు చేయకపోయినా.. అతడిలో పరుగులు చేయాలనే కసి, తపన ఉండాలన్నారు. ” ప్రతిసారి పరుగులు చేయడం సాధ్యం కాదు.
కానీ పరుగులు చేయాలనే తపన బ్యాటర్ లో కనిపించాలి. స్కోర్ చేయకపోయినా చాలా సేపు క్రీజులో ఉండి బౌలర్లను అలసిపోయేలా చేయాలి. బాల్ పాతబడేదాకా క్రీజ్ లో పాతుకు పోవాలి. కనీసం 50 లేదా 100 బంతులు అయినా ఆడాలి. కానీ గిల్ అలా చేయడం లేదు” అన్నారు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్ లు ఆడిన గిల్ 18.60 సగటుతో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని టార్గెట్ చేసి బద్రీనాథ్ ఫైర్ అయ్యారు.
Also Read: Wpl 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ తేదీ ఖరారు…వేదికలు ఎక్కడంటే?
గతంలో కూడా టీమిండియా ఎంపికపై ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు బద్రీనాథ్. ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కని సమయంలో వారు బ్యాడ్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండడం అవసరమనిపిస్తుందని అన్నారు. జట్టులో చోటు దక్కాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకోవాలేమో, ఒళ్లంతా టాటూలు వేయించుకోవాలేమో, లేదంటే మంచి మీడియా మేనేజర్ ని కలిగి ఉండాలేమో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బద్రీనాథ్ భారత జట్టు తరఫున రెండు టెస్ట్ లు, 7 వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడారు. 2011లో చివరి మ్యాచ్ ఆడారు బద్రీనాథ్. ఇక ఐపీఎల్ లో 2010, 2011 సంవత్సరాలలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 356, 396 పరుగులు చేసి సీఎస్కే టైటిల్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించారు.