Malaysia Open: మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ స్టార్ షట్లర్లు గాయత్రి గోపీచంద్ – ట్రిసా జాలి శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ లో భారత జోడి 21 – 10, 21 – 10 తో థాయిలాండ్ కి చెందిన ఆర్న్ నిచా – సుకిత జంట పై నెగ్గి ప్రీ క్వాటర్ ఫైనల్ లో అడుగు పెట్టింది. భారత షట్లర్లు {Malaysia Open} దూకుడుగా ఆడడంతో మ్యాచ్ కేవలం 30 నిమిషాలలోనే ముగిసింది.
Also Read: Wpl 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ తేదీ ఖరారు…వేదికలు ఎక్కడంటే?
రెండో గేమ్ లో స్కోరు 11 – 9 వద్ద గాయత్రి – టెస్రా ఒక్కసారిగా విజృంభించి ఆడడంతో వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 19 – 9 ఆదిక్యంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఒక పాయింట్ ప్రత్యర్థి జట్టు నెగ్గింది. దీంతో వెంటనే భారత జోడి 2 పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రీ క్వార్టర్స్ లో గాయత్రి జోడి చైనాకు చెందిన జాంగ్ షుక్సియాన్ – జియా ఇఫాన్ జంటతో తలపడనుంది.
ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో ప్రపంచ 12 వ ర్యాంకర్ లక్ష్య సేన్ 14 – 21, 7 – 21 తో (చైనీస్ తైపి) చి యు జెన్ చేతిలో ఓడిపోయాడు. మొదటి గేమ్ లో కాస్త పోరాడిన లక్ష్య సేన్.. రెండో గేమ్ లో పూర్తిగా తేలిపోయాడు. మరోవైపు భారత సీనియర్ ఆటగాడు హెచ్.ఎస్ ప్రణయ్ కి వింత అనుభవం ఎదురైంది. ఇండోర్ స్టేడియం పైకప్పు నుండి నీళ్లు లీక్ కావడంతో రెండు సార్లు అతని మ్యాచ్ కి అంతరాయం కలిగింది. చివరికి గేమ్ ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
పారిస్ ఒలంపిక్స్ తర్వాత తిరిగి బరిలో నిలిచిన హెచ్.ఎస్ ప్రణయ్ మంగళవారం తొలి రౌండ్ లో బ్రియాన్ యాంగ్ తో నెంబర్ 3 కోర్ట్ లో తలపడ్డాడు. తొలి గేమ్ లో 21- 12 తో గెలుపొందాడు. ఇక రెండవ గేమ్ లో 6 – 3 తో ఉన్న సమయంలో స్టేడియం పై కప్పు నుంచి వర్షపు నీళ్ళు కోర్టుపై పడడం మొదలైంది. దీంతో ఆటని కాసేపు నిలిపివేశారు. గంట సమయం అనంతరం తిరిగి కొనసాగించగా.. 11 – 9 ఆదిత్యంలో ఉన్న సమయంలో మరోసారి నీళ్లు కోర్టుపై పడ్డాయి.
Also Read: Yuzvendra Chahal- mistry girl: ఆ అమ్మాయితో రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చాహల్ ?
దీంతో అధికారులు ఈ మ్యాచ్ ని సస్పెండ్ చేసి బుధవారానికి వాయిదా వేశారు. 21 – 12, 11 – 9 స్కోర్ ని తిరిగి బుధవారం రోజు కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఇంత పెద్ద టోర్నమెంట్ లో స్టేడియం పైకప్పు నుండి నీళ్లు కారడం చర్చనీయాంశంగా మారింది. నెంబర్ 3 టేబుల్ మాత్రమే కాదు.. నెంబర్ 2 టేబుల్ కోర్టులో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఈ వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఇక ఈ ఘటనపై నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. వర్షం కారణంగా బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆగిపోవడం ఇప్పటివరకు చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.
Water seems to be leaking from the roof at Prannoys Court
Match disrupted pic.twitter.com/HMYuNgME84— Just Badminton (@BadmintonJust) January 7, 2025