Wpl 2025: మహిళల టి-20 టోర్నీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్) మూడవ సీజన్ సమీపిస్తుంది. ఈ ఏడాది డబ్ల్యూపిఎల్ 2025 టోర్నీ రెండు నగరాలలో రెండు దశల్లో జరగడానికి సిద్ధంగా ఉంది. బరోడా, లక్నో నగరాలలో ఈ ఉమెన్స్ టి-20 ప్రీమియర్ లీగ్ ని నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిర్ణయించింది. డబ్ల్యూపిఎల్ మూడవ సీజన్ ఫిబ్రవరి 6వ తేదీన లేదా 7 న ప్రారంభం కానుందని సమాచారం.
Also Read: Yuzvendra Chahal- mistry girl: ఆ అమ్మాయితో రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చాహల్ ?
ఈ సీజన్ లక్నోలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. లీగ్ మ్యాచ్ లు లక్నోలో నిర్వహించి.. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లని బరోడాలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) – గత ఏడాది రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6 లేదా 7న ప్రారంభం కానుంది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కి సంబంధించిన తేదీలు, వేదికలను బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఈ సీజన్ వేదికల గురించి ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, బరోడా క్రికెట్ అసోసియేషన్ తో బీసీసీఐ అనధికారికంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సీజన్ కి సంబంధించిన వేదికలు, షెడ్యూల్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బరోడా లోని కొటంబి స్టేడియంలో డబ్ల్యూపిఎల్ 2025 సీజన్ ని ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తుందని సమాచారం. అంతేకాకుండా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు కూడా ఇక్కడే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుందని పలు కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ సీజన్ లో మొత్తం 23 మ్యాచ్ లని రెండు దశలలో నిర్వహించనున్నారు. మార్చ్ 8 లేదా 9 తేదీలలో ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. డబ్ల్యూపిఎల్ 2025 టోర్నీలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, జట్లు తలపడనున్నాయి. మొత్తం 23 మ్యాచ్ లు జరగనున్నాయి.
ఇందులో 21 లీగ్ మ్యాచ్ లు, ఓ ఎలిమినేటర్, ఫైనల్ ఉంటాయి. పాయింట్ల పట్టికలో మొదట ఉండే జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాలలో ఉండే జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఎలిమినేటర్ గెలిచే జట్టు ఫైనల్ చేరుతుంది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ జనవరి 10, 12, 15 తేదీలలో రాజ్ కోట్ లో జరగనున్నాయి.
Also Read: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టేది ఎవరంటే?
ఈ మ్యాచ్ లకు హర్మన్ ప్రీత్, రేణుక సింగ్ ఠాకూర్ లకు విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. గత నెలలో వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో హర్మన్ ప్రీత్ మోకాలికి గాయమైంది. ఈ గాయం కారణంగా ఆమె తొలి రెండు టీ-20 లు ఆడలేకపోయింది. దీంతో హార్మోన్ ప్రీత్ కౌర్ ను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కి రిపోర్ట్ చేయాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది.