BigTV English

Euro 2024 – Spain Vs England: యూరో ఫుట్ బాల్ విజేత స్పెయిన్..

Euro 2024 – Spain Vs England: యూరో ఫుట్ బాల్ విజేత స్పెయిన్..

Spain Beats England 2-1 in Euro 2024 Tournament: ప్రపంచ, యూరప్ సాకర్ అభిమానులకు నెలరోజులు నిద్ర లేకుండా చేసిన 2024 యూరోపియన్ టోర్నమెంటులో ఫుట్ బాల్  విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ ఆశలను అడియాసలు చేసి రికార్డు స్థాయిలో నాలుగోసారి విజయభేరి మోగించింది.  బెర్లిన్ లోని ఒలింపిక్స్ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ టైటిల్ పోరులో బలమైన ఇంగ్లండ్ పై అనూహ్యంగా కుర్రాళ్లతో నిండిన స్పెయిన్ 2-1 గోల్స్ తో సంచలన విజయం సాధించింది.


మనదేశంలో క్రికెట్ ని ఎంతగా ప్రేమిస్తారో ప్రపంచంలో, ఇంకా యూరోపియన్ దేశాల్లో ఫుట్ బాల్ కి అంతటి ఆదరణ ఉంది. అక్కడ ఆటగాళ్లు ఆడుతుంటే పిచ్చెక్కిపోతారు.  గ్రౌండుల్లో ఆటను చూడటానికి వచ్చిన అభిమానుల మధ్య కొట్లాటలు జరిగిన ఘటనలెన్నో ఉన్నాయి.

అంతేకాదు ఓడిపోయిన తమ జట్టు ఆటగాళ్లను చితక్కొట్టిన సందర్భాలున్నాయి. అయితే ఆకాశానికెత్తేయడం, లేదంటే చితక్కొట్టేడం అక్కడ షరామూములుగా ఉంటుంది. అందుకే అక్కడ ఫుట్ బాల్ టోర్నమెంటు అంటే..ఆటగాళ్లు కూడా కొంచెం వళ్లు దగ్గర బెట్టుకుని ఆడతారు.


Also Read: Virat Anushka Viral Video: లండన్‌లో విరాట్ కొహ్లీ ఫ్యామిలీ, కీర్తనలు వింటున్న వీడియో వైరల్‌

ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన యూరోపియన్ కప్ ఫుట్ బాల్ పోటీలకు జర్మనీ ఆతిథ్యం ఇచ్చింది. బెర్లిన్ స్టేడియంలోని వేలాదిమంది అభిమానుల సమక్షంలో ఇంగ్లండ్ వర్సెస్ స్పెయిన్ మధ్య నువ్వా? నేనా? అన్నట్టు మ్యాచ్ సాగింది. లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ తిరుగులేని విజయాలతో ఫైనల్స్ వరకు రెండు జట్లు చేరాయి.

ఆట రెండో భాగం 47వ నిముషంలో నికో విలియమ్స్ సాధించిన గోలుతో స్పెయిన్ 1-0తో పైచేయి సాధించింది. అయితే 73వ నిముషంలో కోలే పామర్ చేసిన గోలుతో ఇంగ్లండ్ 1-1తో స్కోరు సమం చేయగలిగింది. ఆట 87వ నిముషంలో మికెల్ ఓయర్ జబాల్ సాధించిన గోలుతో స్పెయిన్ విజేతగా నిలిచింది.

Also Read: పాండ్యా జీవితంలో చీకటి వెలుగులు.. వడోదరాలో ఘన స్వాగతం

వరుసగా రెండోసారి యూరోకప్ ఫైనల్స్ చేరినా ఇంగ్లండ్ రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1966 ప్రపంచకప్ తర్వాత ఇంతవరకు ఇంటర్నేషనల్ టైటిట్ దక్కకపోవడంతో వారి బాధ వర్ణణాతీతంగా మారింది. వేలాదిమంది సాకర్ అభిమానులు విచారంలో మునిగిపోయారు. ఈ మ్యాచ్ కు ప్రిన్స్ విలియమ్, స్పెయిన్ రాజు ఫిలిప్పీతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అంతటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ లో స్పెయిన్ విజేతగా నిలిచింది. స్పెయిన్ జట్టులోని 17  సంవత్సరాల కుర్ర ఆటగాడు యమాల్ తన అసాధారణ ఆటతీరుతో అందరినీ ఆకట్టు కొన్నాడు. ఈ ఫైనల్లో స్పెయిన్ తొలిగోల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నేటి టోర్నమెంటులో తనే హీరో అని అందరూ అంటున్నారు.

Tags

Related News

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Watch Video : ఈ బుడ్డోడు మాములోడు కాదు… బౌలింగ్ వేస్తూ మూతి పగలగొట్టాడు.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Ganesh Idol : RCB ట్రోఫీతో బొజ్జ గణేష్… మళ్లీ తొక్కి సలాట జరగడం గ్యారంటీ అంటూ ట్రోలింగ్ !

Toyota -Team India : టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఎవరంటే?

Big Stories

×