అద్భుతమైన క్రూయిజ్ షిప్. ఆహా అనిపించే సౌకర్యాలు. ఒకే మనస్తత్వం కలిగిన 250 జంటలు. 12 రోజుల పాటు అంటార్కిటికా అంతటా పర్యటన. వింటేనే ఆహా అనిపిస్తుంది కదా. అవును, సీబోర్న్ క్రూయిజ్ షిప్ అంటార్కిటికా టూర్ ను క్రేజీగా ప్లాన్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ టూర్ కు శ్రీకారం చుట్టింది. ఇక ఈ టూర్ లో అడల్ట్ కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. లగ్జరీ లైఫ్ స్టైల్ వెకేషన్స్ సంస్థ ఈ టూర్ ను ప్లాన్ చేసింది. ఈ టూర్ కు గాను ఒక్కో జంటకు 12,000 డాలర్లను వసూళు చేస్తోంది.
ఈ టూర్ గురించి కంపెనీ ఏం చెప్పిందంటే?
అంటార్కిటికా టూర్ కు సంబంధించి లగ్జరీ లైఫ్ స్టైల్ వెకేషన్స్ సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. ఈ ట్రిప్ లో 250 జంటలు పాల్గొంటాయని తెలిపింది. ఈ టూర్ లో భాగస్వాములను మార్చుకోవడంతో పాటు రకరకాల శృంగార భరిత కార్యక్రమాలను ప్లాన్ చేశారు నిర్వాహకులు. హాటెస్ట్ కపుల్స్ తో ఆకట్టుకునే ఈవెంట్స్ తో టూర్ అంతా అదిరిపోనుంది. ఇక ఈ టూర్ లో పాల్గొనే అతిథులకు సెక్సీ ప్లే రూమ్ టైమ్ నైట్లీ థీమ్ పార్టీలు, పూల్/జాకుజీ పార్టీలు, శృంగార ప్రదర్శనలు, అడల్ట్ ఎంటర్ టైన్ మెంట్ అందించబడనుంది. ఈ ప్రయాణంలో అతిథులకు సాయం చేసేందుకు 26 మంది నిపుణులు ఉంటారని కంపెనీ వెల్లడించింది.
అంటార్కిటికా టూర్ లో పెంగ్విన్లు, తిమింగలాలను చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. వాక్ ఇన్ క్లోసెట్ ఇన్ సూట్ లు, కాంప్లిమెంటరీ ప్రీమియం స్పిరిట్స్, షాంపైన్, వైన్ లు, అన్ లిమిటెడ్ వైఫై, వరల్డ్ క్లాస్ డైనింగ్ సౌకర్యం, స్పా, వెల్ నెస్ సెంటర్, సెమినార్ లు, థీమ్ నైట్ లు, మీట్ అండ్ గ్రీట్, DJ, లైవ్ మ్యూజిక్ లాంటి అనేక సౌకర్యాలను లగ్జరీ లైనర్ లో పొందనున్నారు. ఇక ఈ క్రూయిజ్ లో ఎనిమిది రకాల ఫుడ్స్ అందిస్తుంది. ఇందులో 8 బార్ లు, లాంజ్ లు, 4 ఓపెన్ వర్ల్ పూల్స్ తో కూడిన ఇన్ఫినిటీ పూల్, లైబ్రరీ, రెండు సబ్ మెరైన్లు, గెస్టుల కోసం పలు కయాక్ లను కలిగి ఉంటుంది. “ఈ టూర్ లో పాల్గొనే జంటలకు జీవితంలో మర్చిపోలేని అనుభవాలను అందించబోతున్నాం. “చలి ఇబ్బంది కలగని తొలి అంటార్కిటికా క్రూయిజ్ టూర్ ఇదే కాబోతోంది” అని కంపెనీ వెల్లడించింది.
ఇప్పటికే అన్ని టికెట్లు సేల్
ఇక ఈ అద్భుతమైన అంటార్కిటికా యాత్ర ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులను ఆకర్షిస్తుంది. సందర్శకులు అద్భుతమైన మంచు కొండలు, ఎత్తైన పర్వతాలు, హిమానీనదాలను చూసి ఎంజాయ్ చేయనున్నారు. విస్తారమైన పెంగ్విన్ కాలనీలతో పాటు ఓర్కాస్, హంప్ బ్యాక్ తిమింగలాలు, సీల్స్, అంటార్కిటిక్ సీల్స్ సహా అనేక వన్య ప్రాణులను చూసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ టూర్ కు సంబంధించి అన్ని టికెట్లు సేల్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. త్వరలోనే మరిన్ని క్రూయిజ్ ట్రిప్ లను ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: అందుబాటులోకి వాటర్ మెట్రో.. మీరూ ఓసారి జర్నీ చేసేయండి!