E-Paper
Advertisement

టీమిండియాపై షాయ్ హోప్ ఊచకోత..ట్రావిస్ హెడ్‌కు కొత్త టెన్షన్

టీమిండియాపై షాయ్ హోప్ ఊచకోత..ట్రావిస్ హెడ్‌కు కొత్త టెన్షన్
Advertisement

Shai Hope In To SRH:  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఊతకోత కోశాడు. సెంచరీ చేసి, టీమిండియాను చిత్తుగా ఓడించాడు.ఈ క్రమంలో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ను కొనుగోలు చేసేందుకు కావ్య పాప నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

షాయ్ హోప్‌కు కావ్య పాప బంపర్ ఆఫర్

ఐపీఎల్ 2027 వేలం త్వరలోనే జరుగనున్న తరుణంలో ఎలాగైనా షాయ్ హోప్ పాల్గొనే చాన్సులు కనిపిస్తున్నాయి. గత సీజన్ లో అన్ సోల్డ్ అతడు మిగిలిపోయాడు. అయితే, ఈ సారి అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. షాయ్ హోప్ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడొద్దని ఇటు కావ్య పాప (Srh Kavya Maran) నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, ట్రావిస్ హెడ్ ను వేలంలో వదిలేసి, అతని స్థానంలో షాయ్ హోప్ పై డబ్బులు పెట్టాలని స్కెచ్ వేశారని అంటున్నారు. ఇదే జరిగితే, వచ్చే సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ గా షాయ్ హోప్ మారబోతున్నట్టు చర్చ నడుస్తోంది. అంటే అభిషేక్ శర్మతో షాయ్ హోప్ ఓపెనింగ్ చేయనున్నాడని చర్చిస్తున్నారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

ట్రావిస్ హెడ్ స్థానంలో షాయ్ హోప్ బెటర్ ?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్ స్థానంలో షాయ్ హోప్ ను తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రూ.14 కోట్లు తీసుకుంటున్న ట్రావిస్ హెడ్, గత రెండు సీజన్లుగా పెద్దగా రాణించడం లేదు. 2026లో అయితే, ఒక్క మ్యాచ్ గెలిపించలేకపోయాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి మినహా ఎవరూ సరిగ్గా ఆడలేదు. దీంతో సరిగ్గా ఆడని వాళ్లను వదిలేసే పనిలో కావ్య పాప ఇప్పటికే పడ్డారని సమాచారం. ఇందులో ట్రావిస్ హెడ్ పేరు కూడా ఉందని సమాచారం. ప్యాట్ కమిన్స్ తో పాటే హెడ్ ను వదిలేస్తారని తెలుస్తోంది. అందుకే ఇండియాలో టూర్ లో ఇరగదీస్తున్న షాయ్ హోప్ ను తీసుకోవాలని కావ్య ఇప్పటికే స్కెచ్ వేశారట.

Advertisement

రూ.14 కోట్లు కాదు, మరో రెండు కోట్లు ఎక్కువైనా అతన్ని ఫారెన్ ప్లేయర్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. షాయ్ హోప్ వస్తే, అభిషేక్ తో ఓపెనింగ్ చేస్తాడు. అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ జట్టుకు ప్లస్ కానుందని లెక్కులు కూడా వేసుకున్నట్టు తెలుస్తోంది. మరి వేలంలో ఏం జరుగుతుందో చూడాలి. కాగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో 162 పరుగులు చేసిన షాయ్ హోప్, రెండో టీ20లో సెంచరీ చేశాడు. దీంతో అతన్ని ఐపీఎల్ లోకి తీసుకోవాలని కోరుతున్నారు క్రికెట్ లవర్స్.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

 

 

Related News

ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పక్కా..ఇక అన్ని సిక్సర్లు, బౌండరీలే!

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

Big Stories

Advertisement
×