Japanese Anime Fantasy Comedy Series OTT : రోజూ ఆఫీసుకు వెళ్లడం, పని ముగించుకుని ఇంటికి రావడం… ఇదే జీవితం అనుకుంటూ బతికే వాళ్లు చాలామందే ఉంటారు. అలాంటి ఓ సాధారణ ఉద్యోగి తన ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి ఓ చిన్న పక్షిని ఇంటికి తీసుకొస్తాడు. కానీ అది మామూలు పక్షి కాదు. మరో ప్రపంచానికి చెందిన శక్తివంతమైన మాంత్రికుడు. ఆ విషయం తెలిసిన తర్వాత అతడి జీవితంలో జరిగే మార్పులే ‘Sasaki and Peeps’ సిరీస్ స్టోరీ. ఇప్పుడు రెండో సీజన్ తో ఈ ఫాంటసీ కథ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రేజీ జపనీస్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అంటే…
ససాకి ఓ ఉద్యోగి. ఉద్యోగం, ఇంటి జీవితం తప్ప అతడి లైఫ్ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు. ఒంటరితనం నుంచి బయట పడటానికి ఓ పెంపుడు పక్షిని కొనుక్కుంటాడు. దానికి పీప్స్ అని పేరు పెడతాడు. మొదట అది చిన్న పక్షి మాత్రమే అనుకుంటాడు. కానీ పీప్స్ కు మరో ప్రపంచంతో సంబంధం ఉందని, అతడికి సాధారణ జీవులకు లేని మాయా శక్తులు ఉన్నాయని తెలిసిన తర్వాత ససాకి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది.
పీప్స్ మరో ప్రపంచానికి చెందిన మాంత్రికుడు కావడంతో, ససాకి ఊహించని పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. సాధారణ ఉద్యోగిగా తన బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఒకవైపు ఉంటే, మరో ప్రపంచానికి సంబంధించిన సమస్యలు మరోవైపు అతడిని వెంటాడుతుంటాయి. ఇలాంటి సమయంలో పీప్స్‌తో ఏర్పడిన అనుబంధం అతడికి కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. అలాగే వింత సంఘటనల్లోకి తీసుకెళ్తుంది. ఫాంటసీ ప్రపంచంలోని శక్తులు, ప్రమాదాలు, విచిత్రమైన పాత్రలు కథలో ప్రత్యేకమైన ఆసక్తిని క్రియేట్ చేస్తాయి.
రెండో సీజన్ లోనూ ససాకి జీవితంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. అతడి బాస్ అతడిని మాట్లాడేందుకు పిలవడం, పొరుగింటి మహిళ ఓ వింత ప్రపంచంతో సంబంధం ఉన్న పరిస్థితిలోకి రావడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ససాకి తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుంటూ, పీప్స్ సహాయంతో వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇంతకీ ఆ ససాకికి ఆ పక్షి వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి ? వాటిని ఎలా దాటాడు ? అన్నది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.
Also Read : భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ
రెండో సీజన్ తొలి ఎపిసోడ్ 2026 అక్టోబర్ 7న విడుదలైంది. ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలో జపనీస్ ఆడియోలో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఈ యానిమేలో టోమోకాజు సుగిత ససాకి పాత్రకు, అయో యూకి పీప్స్ పాత్రకు గాత్రదానం చేశారు. అకారి కిటో సహా పలువురు వాయిస్ ఆర్టిస్టులు ఇతర పాత్రలకు గాత్రం అందించారు. ఫాంటసీ, కామెడీ, ప్యారలల్ ప్రపంచాల కథలు ఇష్టపడేవారు ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వొద్దు.