BigTV English

SRH – Venkatesh Iyer : SRH నుంచి ఇషాన్ ఔట్.. అయ్యర్ ఇన్..!

SRH – Venkatesh Iyer :  SRH నుంచి ఇషాన్ ఔట్.. అయ్యర్ ఇన్..!

SRH – Venkatesh Iyer :  సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 2025 సీజన్ లో వచ్చిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఇతను ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలం చెందింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రక్షాళన పై యాజమాన్యం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసిన స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ని ట్రేడ్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇషాన్ కిషన్ స్థానంలో కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని టీమ్ లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవలే అతను కౌంటీ క్రికెట్ లో నాటింగ్ హోమ్ ఫైర్ తో రెండు మ్యాచ్ ల ఒప్పందం పై సంతకం చేసాడు.


Also Read :  Asia Cup : బంగ్లాదేశ్, పాకిస్థాన్ కు షాకిచ్చిన BCCI.. ఆసియా కప్ రద్దు?

SRH పై ట్రోలింగ్స్.. 


మరోవైపు సోషల్ మీడియాలో సన్ రైజర్స్ పై ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. కీలక ఆటగాడిని వదులుకొని చెత్త ఆటగాడిని కొనుగోలు చేయాలని సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తోందా..? అని కామెంట్స్ చేస్తున్నారు. 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్ జట్టు తమ కోచింగ్ స్టాప్ లో పెద్ద మార్పు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోణ్ ను కొత్త బౌలింగ్ కోచ్ గా నియమించింది. జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో బౌలింగ్ కోచ్ గా రానున్నాడు. గతంలో వరుణ్ అరోణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ ను ఎస్ఆర్ హెచ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అతన్ని మళ్లీ వేలంలోకి పంపి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి అని అప్పట్లో వరుణ్ ఆరోన్ కామెంట్స్ చేశాడు. అలాగే బౌలర్ మహ్మద్ షమీని కూడా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బౌలింగ్ కోచ్ గా వరుణ్ ఆరోన్.. 

అలా అన్న అతనే ఇప్పుడు బౌలింగ్ కోచ్ గా రావడం గమనార్హం. వాస్తవానికి ఒక నిపుణిగా తన వ్యక్తి గత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాడు. అప్పుడు అతను ఏ జట్టులో భాగం కాదు.. కానీ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ గా నియమితులైన తరువాత గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇషాన్ కిషన్ మెగా వేలంలో SRH ఫ్రాంచైజీ రూ.11.25 కోట్లు వెచ్చింది తమ జట్టులోకి తీసుకుంది. అయితే 2025 సీజన్ లో అతను 14 మ్యాచ్ ల్లో 354 పరుగులు మాత్రమే చేసాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెెంచరీ మాత్రమే ఉన్నాయి. ఈ ఇద్దరూ ఆటగాళ్ల ప్రదర్వ వారి భారీ ధరలకు తగ్గట్టుగా లేకపోవడంతో వరుణ్ ఆరోన్ వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. వరుణ్ ఆరోన్ కోచ్ గా ఉన్నాడు కాబట్టి అతను గతంలో చేసిన అంచనాలు వాస్తవం అయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా ఇషాన్ కిషన్ ని తప్పించడం చూస్తుంటే అలాగే కనిపిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.

 

Related News

BCCI : బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా.. ప్ర‌పంచంలోనే రిచ్..!

Pakisthan Blast : క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Asia Cup 2025 jersey : టీమిండియా న్యూ జెర్సీ వచ్చేసింది… జెర్సీ లేకుండానే.. ఫోటోలు చూసేయండి

Asia Cup 2025 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై బీసీసీఐ సంచలన ప్రకటన.. నెత్తురు మరుగుతోందని అభిమానుల ఆగ్రహం

Asia Cup 2025 : ఆసియా క‌ప్ 2025 జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

Neymar Junior : రూ.10వేల కోట్ల ఆస్తి.. ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చేసిన బిలియనీర్‌

Big Stories

×