OTT Movie : సైకో కిల్లర్ సినిమాలకు ఓటీటీలలో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సినిమాలకు థియేటర్లలో పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు. కానీ ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అలాంటి ఓ సైకో కిల్లర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ తమిళ్ సైకో కిల్లర్ థ్రిల్లర్ పేరు ‘సైలెంట్’ (Silent). 2024 నవంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. గణేశ పాండి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గణేశ పాండి (భువనేష్), సమయ మురళి, ఆరాధ్య (శివగామి), మురళి రాధాకృష్ణన్ (ఇన్‌స్పెక్టర్ రఘురామ్) నటించారు. SR డ్రీమ్ స్టూడియోస్ బ్యానర్‌లో S రామ్ ప్రకాష్ నిర్మించారు. సమయ మురళి సంగీతం సమకూర్చగా, 1 గంట 36 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ… అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఒక సైకో కిల్లర్ కేవలం అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి చంపుతాడు. పోలీసులు సైతం అతన్ని పట్టుకోవడానికి ముప్పుతిప్పలు పడతారు.
కథలోకి వెళ్తే…
సైలెంట్ కథ భువనేష్ (గణేశ పాండి) చుట్టూ తిరుగుతుంది. అతని తల్లి శివగామి (ఆరాధ్య) టెర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. అయితే ట్రీట్మెంట్ టైంలో ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతుంది. అందుకే మెర్సీ కిల్లింగ్ కోసం వేడుకుంటుంది. భువనేష్ తన తల్లి బాధను చూడలేక, ఆమె కోరికను నెరవేర్చడానికి ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఎఫెక్ట్ ఆయన జీవితాన్ని మార్చేస్తుంది. ఇక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది.
అప్పటి నుంచి హీరో వరుసగా అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ చంపుతాడు. ముఖ్యంగా రోగంతో బాధపడే అమ్మాయిలనే టార్గెట్ చేస్తాడు. ఇన్‌స్పెక్టర్ రఘురామ్ (మురళి రాధాకృష్ణన్) భువనేశ్ చేసే హత్యలకు సంబంధించిన కేసులను విచారిస్తాడు. అతని ఇన్వెస్టిగేషన్ లో భువనేష్ గతం, అతని ఉద్దేశ్యాలు, ఈ హత్యల మధ్య ఉన్న కనెక్షన్ వంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇది షాకింగ్ రివిలేషన్స్‌కు దారితీస్తుంది. కథ సస్పెన్స్‌తో నిండిన ట్విస్ట్‌లతో ముందుకు సాగుతుంది.
Read Also : పని మనిషిగా వచ్చి యజమానితో రాసలీలలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా
ఇంతకీ భువనేష్ ఇలా అమ్మాయిలనే చంపడానికి గల కారణం ఏంటి? అతని చేతిలో చనిపోయిన అమ్మాయిలు ఎవరు? ఈ సైకో గతం ఏంటి? అతను ఎందుకిలా మారిపోయాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఒక లుక్కేయండి. సైకో కిల్లర్ సినిమాలంటే బాగా ఇష్టపడేవారు ఈ వీకెండ్ ‘సైలెంట్’ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.