SRH – Don Film : ఐపీఎల్ లో ఏ సీజన్ లో ఏ టీమ్ రాణిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. గత సీజన్ లో కేకేఆర్ టైటిల్ సాధించగా.. ఈ సారి అంతగా ఫామ్ లో లేదు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఫైనల్ వరకు వెళ్లి ఫైనల్ లో ఓడిపోయింది. గత సీజన్ లో అద్భుతంగా రాణించింది SRH జట్టు. ఈ సీజన్ లో మాత్రం వరుస పరాజయాలతో ప్లే ఆప్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది హైదరాబాద్ జట్టు. ఇక ఈ ఓటమితో చెన్నై ప్లే ఆప్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్ రైజర్స్ అవకాశాలు మాత్రం కాస్త సజీవంగానే ఉన్నాయి. ప్లే ఆప్స్ కి అర్హత సాధించాలంటే మాత్రం లీగ్ దశలో ప్రతీ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలి. ఒక్క మ్యాచ్ లో ఓడినా ప్లే ఆప్స్ అవకాశాలు గల్లంతు అవుతాయి.
Also Read : IPL 2025 playoffs : ఏ జట్టుకు ఎంత ఛాన్స్.. SRH ఇంటికేనా..?
ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సేద తీరేందుకు మాల్దీవులకు వెళ్లారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సిన మ్యాచ్ కు దాదాపు 6 రోజుల సమయం ఉండటంతో సన్ రైజర్స్ టీమ్ మాల్దీవులకు బయలుదేరింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున నటించిన డాన్ సినిమా డైలాగ్ ను ప్రాక్టీస్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో నాగార్జునని ట్రోల్స్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. నాగార్జున డాన్ సినిమాలో విలన్ తో చెప్పిన డైలాగ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు ఇషాన్ కిషన్.. అభినవ్ మనోహర్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : Kevin Pietersen: విరాట్ కోహ్లీ, పీటర్సన్ ఇద్దరు తేడానా.. వైరల్ అవుతున్న ఫోటోలు
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆప్స్ కి చేరాలంటే ఐదు మ్యాచ్ లు గెలవాల్సిందే. అయితే ఐదు మ్యాచ్ లు గెలిచేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ పుల్ ప్రాక్టీస్ లో మునిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తీరా సీన్ కట్ చేస్తే.. ప్లైట్ ఎక్కి మాల్దీవుల్లో తేలి ఫుల్ చిల్ అవుతున్నారు. మొన్నటి వరకు పబ్ లు, క్లబ్ లు అంటూ తిరిగిన ఈ ఆటగాళ్లు ఇప్పుడు మాల్దీవులు వెకెషన్ కి వెళ్తున్నారా అంటూ సెటైరికల్ పోస్టులు చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మే 02న గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడనుంది. SRH ఆడే 5 మ్యాచ్ లు కూడా తప్పక గెలవాల్సిందే. గెలిచినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇతర జట్ల పై కూడా ఆధారపడాల్సి వస్తుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలిన మ్యాచ్ లలో విజయం సాధిస్తుందో లేక అపజయం సాధిస్తుందో వేచి చూడాలి మరీ.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 28, 2025