Big Stories

Italy:- చాట్‌జీపీటీని బ్లాక్ చేసిన ఇటలీ ప్రభుత్వం..

Italy:- ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, చాట్‌జీపీటీ వంటి టెక్నికల్ సంచలనాలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చేశాయి. వీటి ఎదుగుదల మానవాళికి ఎంత మంచి చేస్తుందో.. అంతే కీడు కూడా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని దేశాలు నిపుణుల మాట విని.. వీటి వ్యాప్తిని అరికట్టాలి అనుకుంటుంటే.. మరికొన్ని దేశాలు మాత్రం ఏఐను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి అనుకుంటున్నాయి. ఏఐకు చెక్ పెట్టాలి అనుకుంటున్న దేశాల్లో ఇటలీ కూడా ఒకటి.

- Advertisement -

ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాలలోని టెక్ సంస్థలు ఈ ఏఐ తయారీని నిలిపివేయాలని ఒప్పందానికి వచ్చాయి. దీనికి ఏఐ సంస్థలు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ప్రస్తుతం టెక్ వరల్డ్‌లో ఈ ఒప్పందం గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సంబంధించిన చాట్‌జీపీటీని తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఇటలీ తీసుకున్న నిర్ణయం మరొక హాట్ టాపిక్‌గా మారింది. చాట్‌జీపీటీ వల్ల దేశ సమచార ప్రైవసీకి ముప్పు కలుగుతుందని గమనించిన ఇటలీ.. ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

- Advertisement -

చాట్‌జీపీటీ అనేది పూర్తిగా ప్రైవసీ రూల్స్‌ను పాటించే వరకు ఇటలీలో మళ్లీ దీని వినియోగం జరగదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటలీ ఇచ్చిన ఈ ప్రకటనకు చాట్‌జీపీటీ స్పందించలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో, యూనివర్సిటీల్లో చాట్‌జీపీటీని బ్లాక్ చేశారు. ఇది విద్యార్థులు చీటింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలుసుకున్న యాజమాన్యాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. కానీ ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా చాట్‌జీపీటీని ఇటలీ ఎలా బ్లాక్ చేస్తుంది అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకొని ఉన్నాయి. వాటిపై దేశ ప్రభుత్వాలు ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నాయి అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇటలీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఓపెన్ ఏఐ 20 రోజుల్లో స్పందించాలని లేకపోతే 20 మిలియన్ యూరోలు (దాదాపు 22 మిలియన్ డాలర్ల) ఫైన్‌ను కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఫైన్ దాదాపు ప్రపంచ వార్షిక రెవెన్యూలో 4 శాతం అని తెలుస్తోంది.

వాతావరణంలో మార్పులు.. నాసా కొత్త స్ట్రాటజీ..

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News