BigTV English

Rinku Singh: రింకూ సింగ్ పెళ్లిని అడ్డుకుంటున్న ప్రియా సరోజ్‌ తండ్రి ?

Rinku Singh: రింకూ సింగ్ పెళ్లిని అడ్డుకుంటున్న ప్రియా సరోజ్‌ తండ్రి ?

Rinku Singh: టీమిండియా స్టార్‌ ఆటగాడు రింకూ సింగ్ ( Rinku Singh ) పెళ్లిని అడ్డుకుంటున్నాడట ప్రియా సరోజ్‌ ( Priya Saroj ) తండ్రి తుఫానీ సరోజ్ ( Tufani Saroj). దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. సమాజ్‌వాదీ పార్టీ ( Samajwadi Party )పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ప్రియా సరోజ్‌తో ( Priya Saroj ) భారత క్రికెట్ జట్టు ప్లేయర్ రింకూ సింగ్ ( Rinku Singh ) నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన పుకార్లను ప్రియా సరోజ్‌ తండ్రి తుఫానీ సరోజ్ కొట్టిపారేశారు. ఈ మేరకు మీడియాకు తుఫానీ సరోజ్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Also Read: Rohit Sharma: శనివారం రోహిత్ సంచలన ప్రెస్ మీట్..ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా రెడీ ?

టీమిండియా స్టార్‌ ఆటగాడు రింకూ సింగ్ ( Rinku Singh ) , సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ప్రియా సరోజ్‌ ( Priya Saroj ) నిశ్చితార్థం ( Engagement ) జరిగిందని… త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని శుక్రవారం నాడు పలు మీడియా సంస్థలు, జర్నలిస్టులు పలు కథనాలు రాసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే…. కొందరు సోషల్ మీడియాలో రింకూకి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే… టీమిండియా స్టార్‌ ఆటగాడు రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు ప్రియా సరోజ్‌ నిశ్చితార్థం వార్తపై స్వయంగా ఆమె తండ్రి తుఫానీ సరోజ్ స్పందించారు. నిశ్చితార్థం వార్తలను ఖండించారు తండ్రి తుఫానీ సరోజ్.


“ప్రియా సరోజ్‌ ( Priya Saroj ) ప్రస్తుతం తిరువనంతపురంలో ఏదో పని నిమిత్తం ఉంది. రింకూ సింగ్‌తో ఆమె నిశ్చితార్థం జరగలేదు. అవును, కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయి కానీ నిశ్చితార్థం వార్త పూర్తిగా తప్పు” అంటూ తుఫానీ క్లారిటీ ఇచ్చారు. అయితే… తండ్రి తుఫానీ సరోజ్ వ్యాఖ్యలపై రింకూ సింగ్‌ ( Rinku Singh )  ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రింకూ సింగ్‌ పెళ్లి.. ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ విలన్‌ గా మారాడని…అంటున్నారు. అతనే పెళ్లికి ఒప్పుకోవడం లేదని కూడా కామెంట్స్‌ చేస్తున్నారు. వెంటనే రింకూ సింగ్‌ పెళ్లి..చేయాల్సిందేనని.. లేకపోతే బాగుండదని… ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ కు వార్నింగ్‌ ఇస్తున్నారు.

Also Read: BCCI Rules: ఐపీయల్ 2025కు విరాట్ – రోహిత్ దూరం?

కాగా తుఫానీ సరోజ్ ( Tufani Saroj)…. ప్రియా తండ్రి కాగా.. ఆయన ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం జౌన్‌పూర్ నుంచి శాసనసభ సభ్యురాలుగా పని చేస్తున్నారు. ఇక అటు రింకూ సింగ్‌ కాబోయే భార్య ప్రియా సరోజ్…. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా విజయం సాధించారు. గతంలో సుప్రీం కోర్టులో లాయర్‌ గా కూడా పని చేశారట రింకూ సింగ్‌ కాబోయే భార్య ప్రియా సరోజ్. ఇక రింకూ సింగ్‌ విషయానికి వస్తే.. టీమిండియా టీ20 జట్టులో స్థిరపడిపోయాడు. ప్రతి టీ20 సిరీస్‌ లో టీమిండియా తరఫున ఆడుతున్నాడు. జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో రింకూకు అవకాశం దక్కింది. ఇక అటు టీమిండియా స్టార్‌ ఆటగాడు రింకూ సింగ్ ( Rinku Singh )  ఐపీఎల్ లో 13 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. అతన్ని కేకేఆర్ రిటైన్ చేసుకుంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×